Site icon HashtagU Telugu

Prize Money: టీమిండియాకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా..?

Team India Schedule

Team India Schedule

టీ20 వరల్డ్‌‌కప్‌ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టిన భారత్, న్యూజిలాండ్‌ జట్లకు 4 లక్షల అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.3.26 కోట్లు) ప్రైజ్‌మనీ లభించనుంది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లండ్, పాకిస్థాన్‌లలో విజేతగా నిలిచిన జట్టుకు16 లక్షల అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.13.04 కోట్లు) ప్రైజ్‌మనీ ICC ఇవ్వనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు.. 8 లక్షల అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో రూ.6.5కోట్లు) అందుకోనుంది.

ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచ కప్ 2022లో టీమిండియా సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న భారత్ జట్టు ఆశలు ఆవిరి అయ్యాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరినందుకు టీమిండియా జట్టు గణనీయమైన ప్రైజ్ మనీ పొందనుంది. టీ20 వరల్డ్‌‌కప్‌ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టిన భారత్ జట్టుకు 4 లక్షల అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.3.26 కోట్లు) ప్రైజ్‌మనీ లభించనుంది.

టీ20 వరల్డ్ కప్2022 ఎడిషన్ టోర్నమెంట్‌లో కొన్ని ఊహించని జట్ల విజయాలు చూశాం. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించడంతో పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ 1 పరుగు తేడాతో ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. T20 వరల్డ్‌కప్‌-2022లో జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఓడి ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది.