Site icon HashtagU Telugu

Gabba: గబ్బా సంగతేంటి..? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న

Gavaskar

How Many Demerit Points Did Gabba Get. Furious Gavaskar Tears Into Icc For 'harsh' Verdict on indore pitch

ఇండోర్‌ పిచ్‌పై రగడ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచినప్పటకీ.. ఆ దేశానికి^చెందిన పలువురు మాజీలు పిచ్‌పై విమర్శలు గుప్పించారు. అటు ఐసీసీ కూడా ఇండోర్ పిచ్‌పై పెదవి విరిచింది. మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోవడంతో పూర్ పిచ్ అంటూ రేటింగ్ ఇచ్చి మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ఐసీసీ శైలిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గత ఏడాది రెండే రోజుల్లో ముగిసిన గబ్బా (Gabba) పిచ్ సంగతేంటని ఐసీసీని ప్రశ్నించాడు. అప్పుడు గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు కేటాయించిందో తెలుసుకోవాలని ఉందంటూ సెటైర్లు వేశాడు. అప్పుడు ఆ మ్యాచ్ రిఫరీ ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బ్రిస్బేన్ గబ్బా (Gabba) వేదికగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. పిచ్‌ బౌలర్లకు అనుకూలించడంతో కేవలం రెండురోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 152 రన్స్‌కు ఆలౌటవగా.. ఆతిథ్య ఆసీస్ 218 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ టీమ్ కేవలం 99 పరుగులకే కుప్పకూలగా..ఆస్ట్రేలియా 35 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అప్పట్లో ఈ పిచ్‌పై విమర్శలు వచ్చినప్పటకీ ఐసీసీ మాత్రం డీమెరిట్ పాయింట్ల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించింది. బౌలర్లకే పిచ్ అనుకూలించినా.. అప్పుడు గబ్బా (Gabba) పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని గవాస్కర్ ప్రస్తావించాడు. ఇండోర్ పిచ్ మూడురోజుల్లో ముగియగా.. స్పిన్నర్లే ఆధిపత్యం కనబరిచారు. అయితే ఐసీసీ ఇండోర్ పిచ్‌పై అత్యంత వేగంగా స్పందించి డీమెరిట్ పాయింట్లు విధించడంపై భారత మాజీలు ఫైర్ అవుతున్నారు. విదేశీ పిచ్‌లపై టెస్టులు కూడా మూడురోజులు అంతకంటే తక్కువ సమయంలోనే ముగుస్తున్నా.. ఐసీసీ మాత్రం రేటింగ్ విషయంలో సరిగా వ్యవహరించడం లేదని గవాస్కర్ తప్పుపట్టాడు. గబ్బా పిచ్‌ను యావరేజ్ కంటే తక్కువ అని రేటింగ్ ఇచ్చి.. ఇప్పుడు ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇవ్వడం సరికాదని విమర్శించాడు.

Also Read;  Shane Warne: షేన్‌ వార్న్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్