T20 World Cup Final: ఇది కదా కిక్కు అంటే… ఓడిపోయే మ్యాచ్ గెలిచిన భారత్

ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్... అది కూడా వరల్డ్ కప్ ఫైనల్... చేయాల్సింది...24 బంతుల్లో 26 పరుగులు....చేతిలో 6 వికెట్లున్నాయి.. అన్నింటికీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు...ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా...అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు. సౌతాఫ్రికాకు షాకిస్తూ జట్టును గెలిపించి ప్రపంచకప్ అందించారు.

T20 World Cup Final: ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్… అది కూడా వరల్డ్ కప్ ఫైనల్… చేయాల్సింది…24 బంతుల్లో 26 పరుగులు….చేతిలో 6 వికెట్లున్నాయి.. అన్నింటికీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు…ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా…అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు. సౌతాఫ్రికాకు షాకిస్తూ జట్టును గెలిపించి ప్రపంచకప్ అందించారు. 16 ఓవర్లు ముగిసేసరికి క్లాసెన్ 52 , మిల్లర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఇంకా 4 ఓవర్లలో 26 పరుగులు చేస్తే చాలు తొలిసారి వరల్డ్ కప్ సఫారీల సొంతమవుతుంది.

ఇలాంటి స్థితిలో భారత బౌలర్లు హార్థిక్ పాండ్యా , బూమ్రా సంచలన స్పెల్ తో మ్యాచ్ ను మలుపుతిప్పారు. ముఖ్యంగా 17వ ఓవర్ బంతిని అందుకున్న పాండ్యా తొలి బాల్ కే క్లాసెన్ ను ఔట్ చేశాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. తర్వాత 18వ ఓవర్ వేసిన బూమ్రా కేవలం 2 పరుగులే ఇచ్చి మార్కో జెన్సన్ ను ఔట్ చేశాడు. అసలు బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు కూడా మిల్లర్ తడబడ్డాడంటే అతని బంతులు ఎలా సంధించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు ఓవర్లే మ్యాచ్ ను మలుపుతిప్పాయి. భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్న రీతిలో ఓడిపోయే మ్యాచ్ గెలిస్తే ఆ మజానే వేరంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Virat Kohli; ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం