Site icon HashtagU Telugu

Virat Kohli: బొద్దుగా ఉండే కోహ్లీ సూపర్ ఫిట్ గా ఎలా మారాడంటే!

Virat Kohli

Virat Kohli

స్టార్స్ ఊరికే అయిపోరు.. దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఓ సాధారణ బ్యాట్స్ మెన్స్ స్టార్స్ బ్యాట్స్ మెన్ గా మారడానికి కూడా బలమైన కారణాలు ఉంటాయి. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. కెరీర్ ఆరంభంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా బొద్దుగా ఉండేవాడని, కానీ ఆ తర్వాత తన అకుంఠిత పట్టుదలతో సూపర్ ఫిట్‌గా మారాడని పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ చెప్పాడు.

తనకు కోహ్లీపై చాలా గౌరవం ఉందని, అలాగే కోహ్లీ కూడా తనను గౌరవించేవాడని షెహజాద్ గుర్తుచేసుకున్నాడు. పాక్ జట్టులో రాజకీయాల వల్ల తను స్థానం కోల్పోయినట్లు ఇంతకుముందు పలుమార్లు అతను వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన షెహజాద్.. తనకు సాయం కావలసి వచ్చి, కోహ్లీని అడిగినప్పుడల్లా సాయం చేసేవాడని గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు, కోహ్లీ బెస్ట్ ఇంకా రాలేదని, అది త్వరలోనే బయట పడుతుందని అభిప్రాయపడ్డాడు.

‘మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. క్రికెట్ గురించి నాకు ఎప్పుడు సలహాలు, సూచనలు కావాలన్నా.. కోహ్లీ నాకు హెల్ప్ చేసేవాడు. ఒక ఆటగాడిగా నేను కోహ్లీని చాలా గౌరవిస్తా’ అని చెప్పాడు. ‘కోహ్లీ తనను తాను చాలా మార్చుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడినప్పుడు కొంచెం చబ్బీగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత తనను తాను కోహ్లీ అద్భుతంగా మలుచుకున్నాడు. కేవలం క్రికెట్‌లోనే కాదు మిగతా విషయాల్లో కూడా అతనిలో వచ్చిన మార్పులు చాలా గొప్పవి. కెరీర్ ఆరంభంలో ఫిట్ నెస్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కోహ్లీ.. ఆ తర్వాత రాటుదేలి ఫిట్ నెస్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

Also Read: Mudragada: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ మరో లేఖ!