Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పర్యటనలో రెండు సెంచరీలు సాధించి అనేక రికార్డులను సృష్టించిన పంత్.. నాలుగో టెస్ట్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. ఈ ఘటనపై ఇంగ్లీష్ పేసర్ క్రిస్ వోక్స్ పంత్‌కు క్షమాపణలు చెప్పాడు.
పంత్ గాయం, అద్భుతమైన పోరాటం
మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు బంతి అతని కాలికి తగిలింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా స్కాన్‌లో కాలు ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారణ అయింది. అయితే, అద్భుతమైన పోరాట పటిమతో గాయంతోనే బ్యాటింగ్‌కు తిరిగి వచ్చి అర్ధ సెంచరీ సాధించాడు. ఈ గాయం కారణంగా అతను ఐదవ టెస్ట్ మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
Also Read: National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
వోక్స్-పంత్ మధ్య వాత్సల్యపూర్వక సంభాషణ
ఈ సంఘటన గురించి ది గార్డియన్ పత్రికతో క్రిస్ వోక్స్ మాట్లాడుతూ.. రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక సెల్యూట్ ఎమోజీతో తన ఫోటోను పోస్ట్ చేశాడని తెలిపాడు. అందుకు తాను “ప్రేమను గౌరవిస్తాను. కాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను” అని బదులిచ్చానని చెప్పాడు.
ఆ తర్వాత పంత్ తనకు ఒక వాయిస్ నోట్ పంపాడని, అందులో “అంతా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను, కోలుకోవడానికి శుభాకాంక్షలు. మళ్లీ ఎప్పుడైనా అక్కడ కలుద్దాం” అని ఉందని వోక్స్ వెల్లడించాడు. పంత్ కాలికి గాయం కావడానికి తాను కారణం అయినందుకు వోక్స్ క్షమాపణలు కోరాడు.
వోక్స్ గాయం.. బెన్ స్టోక్స్ మద్దతు
రిషభ్ పంత్ లాగే ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ కూడా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని భుజానికి గాయం అయింది. దీని కారణంగా అతను ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. కానీ జట్టు కోసం ఒక చేత్తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. వోక్స్ చేసిన ఈ పోరాటాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సమర్థించాడు.