Irfan Pathan: అహంకారమే పొలార్డ్‌ ఔట్ కు కారణం : ఇర్ఫాన్ పఠాన్

ఐపీఎల్‌-2022 సీజన్ లో ముంబై ఇండియన్స్‌ జట్టు వైఫల్యం కొనసాగుతోంది.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 05:01 PM IST

ఐపీఎల్‌-2022 సీజన్ లో ముంబై ఇండియన్స్‌ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియాన్స్ టీం .. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ చివరి బంతికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని ఫోర్‌ కొట్టి చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు..అయితే ఈ మ్యాచ్ లో పేలవ ఆటతీరుతో వికెట్ సమర్పించుకున్న ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కిరాన్ పొలార్డ్‌ పై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ విమర్శల వర్షం కురిపించాడు.

నాకు ఎదురులేదు అన్న అహంకారంతోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్‌ సమర్పించుకున్నాడంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఇకనైనా పోలార్డ్ అహంభావాన్ని విడిచిపెట్టి జట్టు గెలుపు కోసం ఆడాలని చురకలంటించాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. ‘స్ట్రెయిట్‌ షాట్లు ఆడటమే పొలార్డ్‌ ప్రధాన బలం. అందుకే అక్కడ ధోని అక్కడ ఫీల్డర్‌ను పెట్టాడు . కాబట్టి పొలార్డ్‌ కాస్త నిదానంగా ఆడాల్సింది. కానీ అతడు అప్పుడు కూడా స్ట్రెయిట్‌ షాట్‌ ఆడేందుకే ప్రయత్నించి వికెట్‌ సమర్పించుకున్నాడు అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

ఇక 2010 ఐపీఎల్ సీజన్ లో భాగంగా చెన్నైతో జరిగిన ఫైనల్లో లో కూడా ఇదే మాదిరిగా పొలార్డ్‌ అవుటైన సంగతి తెలిసిందే. మోర్కెల్‌ బౌలింగ్ లో ధోని మిడాఫ్‌లో మాథ్యూ హెడెన్‌ ను ఫీల్డర్‌గా పెట్టగా.. పొలార్డ్‌ అతడికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే తాజా మ్యాచ్ లో
ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ తీక్షణ చేతికి బంతినిచ్చిన ధోనీ ఆ తర్వాత ఫీల్డర్ శివమ్ దూబెని లాంగాన్‌ ఫీల్డర్‌కి చాలా దగ్గరగా..ఉండమని చెప్పాడు ఆ ఓవర్‌లో రెండో బంతిని తీక్షణ క్యారమ్ బాల్‌ రూపంలో విసరగా.. కీరన్ పొలార్డ్ బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లి స్ట్రయిట్‌గా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి నేరుగా వెళ్లి శివమ్ దూబె చేతుల్లో పడింది.దాంతో పోలార్డ్ పెవిలియన్ కు వెళ్ళాక తప్పలేదు.