Site icon HashtagU Telugu

IPL Record: ఐపీఎల్ లో సరికొత్త రికార్డు…ఒక్క వికెట్ పడకుండా 20ఓవర్లు ఆడిన లక్నో..!!

LSG

LSG

IPL2022లో బుధవారం ఓ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 20 ఓవర్లు ఆడిన జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా సీజన్లోనే లక్నో జట్టు అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి సీజన్లోనే సత్తా చాటుతున్న జట్టుగా లక్నో ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటివరకు ఏ ఒక్క జట్టుకు సాధ్యం కానీ రికార్డును లక్నో జట్టు కైవసం చేసుకుంది.

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది లక్నో జట్టు. తన బ్యాటింగ్ సత్తా చూపించింది. లక్నో ఇన్నింగ్స్ ను కెప్పెటన్ కేఎల్ రాహుల్ తో కలిసి ప్రారంభించిన స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్….బ్యాట్ పవర్ ను చూపించాడు.

డికాక్ 70 బంతుల్లో 10ఫోర్లు, 10 సిక్సులతో తన పవర్ ఏంటో చూపించాడు. జట్టు స్కోర్ 210 కాగా..అందులో 140 పరుగులు డికాక్ ఒక్కడే చేశాడు. డికాక్ కు కేఎల్ రాహుల్ పూర్తి సహకారం అందించాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు చేశాడు. కోల్ కత్తా జట్టు 211 పరుగుల లక్ష్యంతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

Exit mobile version