ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన!

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన WPL 2024 మ్యాచ్‌లో (9 మార్చి 2024), హర్మన్‌ప్రీత్ 191 పరుగుల లక్ష్య ఛేదనలో 48 బంతుల్లో అజేయంగా 95 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.

Published By: HashtagU Telugu Desk
Smriti Mandhana

Smriti Mandhana

WPL History: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన పేరిట మరో రికార్డు నమోదైంది. WPL 2026లో భాగంగా జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆమె 61 బంతుల్లో 96 పరుగులు చేసి, తన జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గానూ ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

హర్మన్‌ప్రీత్ రికార్డును అధిగమించిన మంధాన

ఎడమచేతి వాటం స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. జెమిమా రోడ్రిగ్స్ జట్టుపై సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయినప్పటికీ 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కొత్త మైలురాయిని చేరుకున్నారు. WPL చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డు ఇప్పటివరకు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉండగా, మంధాన ఇప్పుడు దానిని బ్రేక్ చేశారు.

Also Read: అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’

2024లో హర్మన్‌ప్రీత్ అద్భుతం

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన WPL 2024 మ్యాచ్‌లో (9 మార్చి 2024), హర్మన్‌ప్రీత్ 191 పరుగుల లక్ష్య ఛేదనలో 48 బంతుల్లో అజేయంగా 95 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.

WPL చరిత్రలో అత్యధిక స్కోర్లు చేసిన భారత బ్యాటర్లు

  • స్మృతి మంధాన- 96 ప‌రుగులు
  • హర్మన్‌ప్రీత్ కౌర్- 95*
  • దీప్తి శర్మ- 88*
  • షెఫాలీ వర్మ- 84
  • స్మృతి మంధాన- 81
  • షెఫాలీ వర్మ- 80*

 

  Last Updated: 18 Jan 2026, 04:53 PM IST