Umran Malik @IPL: ఉమ్రాన్ మాలిక్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలుసా ?

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరాశ పరిచినా ఆ జట్టులో పలువురు ఆటగాళ్ళు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 31, 2022 / 11:16 PM IST

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిరాశ పరిచినా ఆ జట్టులో పలువురు ఆటగాళ్ళు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణించాడు.తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వేగమే కాకుండా సీజన్ మొత్తం నిలకడగా రాణించాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్‌ మాలిక్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది సీజన్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ పలు అవార్డులను సొంతం చేసుకుని ప్రైజ్ మనీ ద్వారా బాగానే సంపాందించాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించి ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు ఉమ్రాన్ మాలిక్ అందుకున్నాడు. కేవలం ఈ అవార్డుల ద్వారానే ఉమ్రాన్ మాలిక్‌ రూ. 14 లక్షలు సంపాదించాడు.

అలాగే ఈ సీజన్ లీగ్ దశ మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు గాను ఉమ్రాన్ మాలిక్‌కు రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు కూడా దక్కింది. ఈ రెండు అవార్డుల ద్వారా మాలిక్ రూ. 2 లక్షలు ఆర్జించాడు అలాగే ఈ రెండు మ్యాచులలో కనబర్చిన ఆటతీరుకు గాను గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల రూపంలో మరో రూ. 2లక్షలు సంపాదించుకున్నాడు. అలాగే పంజాబ్ తో మ్యాచ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఉమ్రాన్‌కే దక్కింది.  దీనికి ఓ లక్ష.  మొత్తంగా రూ. 3 లక్షలు ఉమ్రానక్‌కు దక్కాయి. అదే విధంగా అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు రూపంల మరో రూ.10 లక్షలు దక్కాయి. కాగా ఈ ఏడాది సీజన్‌లో మొత్తం అవార్డుల రూపంలో ఉమ్రాన్‌ మాలిక్‌ రూ. 29 లక్షలు  సంపాదించాడు. కాగా ఐపీఎల్ ప్రదర్శనతోనే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టీమిండియా జట్టుకు కూడా ఉమ్రాన్ మాలిక్‌ ఎంపికయ్యాడు.