Heinrich Klassen: విధ్వంసకరుడు హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్

హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేయడంతో క్రీడాలోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. రిటైర్మెంట్ ప్రకటిస్తూ క్లాసేన్ భావోద్వేగానికి గురయ్యాడు.

Heinrich Klassen: హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేయడంతో క్రీడాలోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. రిటైర్మెంట్ ప్రకటిస్తూ క్లాసేన్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదోనని ఒకటికి పది సార్లు అలోచించి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.

దక్షిణాఫ్రికా విధ్వంసకరుడు హెన్రిచ్ క్లాసెన్ టెస్ట్‌ క్రికెట్‌ కి గుడ్ బై చెప్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. హెన్రిచ్ క్లాసెన్ నిర్ణయాన్ని సానుకూలంగా తీసుకున్న ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా రిటైర్మెంట్ అంశాన్ని అధికారికంగా వెల్ల‌డించింది. గతవారం సౌతాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్ లో క్లాసెన్ బ‌దులు కైలీ వెర్రెన్నేను ఆడించారు. దాంతో ఇక సుదీర్ఘ ఫార్మాట్ త‌న‌కు వ‌ర్క‌వుట్ కాద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ టూర్లోనే సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు తాజాగా హెన్రిచ్ క్లాసెస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. .

2017 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సౌతాఫ్రికా జట్టుకు క్లాసెన్ ఎంపికయ్యాడు. కానీ ఆ సిరీస్ ఆడలేకపోయాడు. దాంతో 2019లో భార‌త ప‌ర్య‌ట‌న‌లో క్లాసెన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాంచీలో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం రెండో మ్యాచ్ కోసం అత‌డు నాలుగేండ్లు నిరీక్షించాల్సి వ‌చ్చింది. 2023లో క్లాసెన్ వెస్టిండీస్‌తో సిడ్నీ, సెంచూరియ‌న్, జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. మొత్తంగా నాలుగు మ్యాచుల్లో అత‌డు 104 ర‌న్స్ కొట్టాడంతే. అయితే వైట్ బాల్ క్రికెట్‌లో హెన్రిచ్ క్లాసెన్ చాలా ప్రమాదకరమైన బ్యాటర్. వ‌న్డేలు, టీ20ల్లో క్లాసెన్ ట్రాక్ రికార్డు అద్భుతం. బంతిని బ‌లంగా కొట్టే ఈ హిట్ట‌ర్‌కు పొట్టి ఫార్మాట్‌లో 172.71, వ‌న్డేల్లో 140.66 స్ట్రైక్ రేటు ఉంది. 2023లో బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు.

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో క్లాసెన్ దక్షిణాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. క్లాసెన్ గతేడాది ఐపీఎల్‌ సీజన్లో హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.టెస్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్లాసేన్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అరంగేట్రం స‌మ‌యంలో నాకు ల‌భించిన‌ టెస్ట్ క్యాప్ ని జీవితాంతం మర్చిపోను. టెస్టు కెరీర్‌లో నాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు నాముందు కొత్త స‌వాళ్లు ఉన్నాయి. వాటిని ఎదుక్కొనేందుకు సిద్ధంగా ఉన్నా అని క్లాసెన్ వెల్ల‌డించాడు. ఇక నుంచి వ‌న్డేలు, టీ20ల‌పై ఈ డాషింగ్ బ్యాట‌ర్ దృష్టిపెట్టనున్నాడు.

Also Read: Bomb Blast : పోలియో వ్యాన్‌పై బాంబుదాడి.. ఆరుగురు పోలీసులు మృతి