India vs New Zealand: టైగా ముగిసిన రెండో వన్డే.!

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ టై గా ముగిసింది.

Published By: HashtagU Telugu Desk
Cropped (2)

Cropped (2)

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను టై గా ప్రకటించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 రన్స్ చేసింది. అప్పటికే వర్షం వల్ల మ్యాచ్ లో ఒక్కో ఇన్నింగ్స్ ను 29 ఓవర్లకు కుదించారు. అయితే మళ్లీ వర్షం పడి ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. 3 మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 30న జరగనుంది.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా జట్టులో ఓపెనర్‌ ధావన్‌ (3) త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ (34)తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45) భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అర్ధశతక (66) భాగస్వామ్యం చేశారు. తొలి వన్డేలో టీమిండియా ఓడిపోవడం, ఈ రెండో వన్డే టై కావడంతో ఈ నెల 30న జరగనున్న మూడో వన్డేలో భారత్ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

 

  Last Updated: 27 Nov 2022, 01:09 PM IST