Site icon HashtagU Telugu

Virat Kohli Networth: అతడు రన్స్ మెషీన్ మాత్రమే కాదు.. మనీ మెషీన్ కూడా

Happy Birthday Virat Kohli

Virat Kohli Imresizer

రన్స్ మెషీన్.. ఈ బిరుదు విరాట్ కోహ్లీకి ఉంది.అతడికి క్రికెట్ ప్రపంచంలో ఇంకో పేరు కూడా ఉంది. అదే మనీ మెషీన్. 2023 సంవత్సరపు లెక్కల ప్రకారం.. విరాట్ కోహ్లీ మొత్తం ఆస్తులు సుమారు రూ. 1010 కోట్లుగా అంచనా వేయబడింది.  2020 సంవత్సరంలో కోహ్లీ BCCIతో A- ప్లస్ కాంట్రాక్టును కలిగి ఉన్నాడని, దానిలో అతను సంవత్సరానికి రూ. 81 కోట్లు పారితోషకం తీసుకునేవాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌ నుంచి కూడా చాలా సంపాదిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో వేలం ద్వారా రూ.173 కోట్లు సంపాదించాడు. అతను బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. 2008లో రూ. 12 లక్షల జీతంతో ఐపీఎల్‌ కెరీర్ ను ప్రారంభించిన విరాట్ కోహ్లి.. 2023 ఐపీఎల్‌ లో రూ. 15 కోట్ల ప్యాకేజ్ పొందాడు. 2022 ఐపీఎల్‌ను కూడా కోహ్లీ అదే మొత్తంతో పూర్తి చేశాడు. విరాట్ కోహ్లి రూ.180 కోట్లు పలుచోట్ల పెట్టుబడి పెట్టగా.. అతడి వద్ద రూ.42 కోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయి.

యాడ్స్ లోనూ ..

విరాట్ కోహ్లి కేవలం క్రీడల నుంచే కాకుండా ప్రకటనల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. ఈ లిస్టులో Puma, MRF, Audi, Tissot, Toyota, Boost Drink, BSF (Border Security Force), Fastrack, Nike, Red Chief Shoes, Manyavar, TVS, Fair and Lovely, Pepsi Ad, Flying Machine వంటి పెద్ద కంపెనీల యాడ్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ డబ్బు పరంగానే కాదు అభిమానుల సంఖ్య పరంగా కూడా చాలా రిచ్. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లలో అతనికి మొత్తం 134 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సచిన్ టెండూల్కర్‌ రేంజ్లో.. ఒక యాడ్ కోసం కోహ్లీ రోజుకు రూ.2 కోట్లు వసూలు చేశాడు. ధోనీ కూడా ఒక్కరోజుకు రూ.1.5 కోట్లు తీసుకున్నాడు.