Site icon HashtagU Telugu

Virat Kohli: అందరిలాగే కోహ్లీ విసిగిపోయాడు.. త్వరలోనే “విరాట్” రూపం చూస్తాం : మైక్ హెస్సన్

Virat Kohli

Virat Kohli

ఫామ్ లో లేక ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ పై ఒక్కొక్కరు ఒక్కో విధమైన కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని ఇటీవల భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సలహా ఇచ్చారు. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తీసుకోలేమని కోహ్లీకి చెప్పేందుకు బీసీసీఐ ఎంపిక కమిటీ సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో కోహ్లీ ని సపోర్ట్ చేస్తూ ఒక వ్యక్తి నోరు విప్పాడు. అతడే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్.

” కోహ్లీ ఆటలో ఎక్కడా తప్పు లేదు. త్వరలోనే అతడు భారీ ఇన్నింగ్స్ తో చెలరేగుతాడు. ఆర్సీబీకి ఉన్న అత్యున్నత ఆటగాడు కోహ్లీ” అని ఆయన ధైర్య వచనాలు చెప్పారు. శుక్రవారం పంజాబ్ సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్నామని ఆయన తెలిపారు.అంతా బాగా జరుగుతోందనుకున్న టైంలో.. 20 (14 బంతులు) పరుగుల వద్ద కోహ్లీ ఔటైపోయాడని మైక్ హెస్సన్ విచారం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్ కోసం కోహ్లీ తనను తాను బాగా సిద్ధం చేసుకున్నాడని, అయితే, మళ్లీ నిరాశ తప్పలేదని అన్నాడు. అందరిలాగానే కోహ్లీకీ విసుగొచ్చేసిందని కామెంట్ చేశాడు.

ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసింది. బెంగళూరు టీమ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక్కడే అత్యధికంగా 35 రన్స్ చేశాడు. పంజాబ్ కింగ్స్ టీమ్ లో లియమ్ లివింగ్ స్టెన్, జాన్ బైర్ స్టో చెరో అర్ధ సెంచరీ చేశారు.

Exit mobile version