Team India Superstar: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ గత ఏడాదిన్నరగా అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు కొల్లగొడుతున్నాడు. విధ్వంసమే పనిగా పెట్టుకుని బౌలర్లపై దాడికి పాల్పడుతున్నాడు.టెస్టు,వన్డే, టీ20 ప్రతి ఫార్మెట్లోనూ హెడ్ నిప్పులు చిమ్ముతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో భయం పుట్టిస్తున్నాడు. 2023 WTC మరియు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలవడంలో ట్రావిస్ హెడ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. కొంతకాలం టి20లో తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. ఈ ఫార్మెట్లో సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. హెడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరుపున అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా మారాడు.
ట్రావిస్ హెడ్ (Travis Head) తాజాగా టీమిండియా ఫ్యూచర్ స్టార్ ని ఎంపిక చేశాడు. ఓ కార్యక్రమంలో టీమిండియా తదుపరి సూపర్‌స్టార్ పేర్లు చెప్పమని ఆస్ట్రేలియా ఆటగాళ్లను అడిగారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ మరియు మార్నస్ లాబుస్చాగ్నేలతో సహా పలువురు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు జైస్వాల్ ప్రతిభను మెచ్చుకున్నారు. జైస్వాల్ అన్ని ఫార్మాట్‌లకు సరైన క్రికెటర్‌గా కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే ట్రావిస్ హెడ్ యశస్వి జైస్వాల్ ను మెచ్చుకుంటూనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ను భారత జట్టు భవిష్యత్తు కెప్టెన్ గా ఎంపిక చేశాడు. జైస్వాల్ మరియు గిల్ ఇద్దరూ చాలా ప్రతిభావంతులైన ఆటగాళ్లు. ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. అయితే హెడ్ గిల్‌ను టీమ్ ఇండియా తదుపరి సూపర్ స్టార్‌గా ఎంచుకోవడానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి గిల్ మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన టీ20లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ 25 టెస్టుల్లో 4 సెంచరీలతో సహా 1492 పరుగులు చేశాడు, 47 వన్డేల్లో 6 సెంచరీలతో సహా 2328 పరుగులు, 21 టీ20ల్లో 1 సెంచరీతో సహా 578 పరుగులు చేశాడు. కాగా యశస్వి జైస్వాల్ 9 టెస్టుల్లో 3 సెంచరీలతో 1028 పరుగులు చేశాడు. 23 టీ20ల్లో 1 సెంచరీతో 723 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు.
Also Read: Devara : ‘దేవర’ కొత్త పోస్టర్ రిలీజ్.. బాక్సాఫీస్ ఆయుధ పూజ అంటూ..