Site icon HashtagU Telugu

HCA : ఈడెన్ గార్డెన్స్‌ను సంద‌ర్శించిన హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రావు.. అధునాత‌న క్రికెట్ మైదానాల‌పై అధ్యాయ‌నం

HCA President

HCA President

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ఆధీనంలోని ఉప్ప‌ల్ స్టేడియంను ప్ర‌పంచంలోని మేటి క్రికెట్ మైదానాల్లో ఒక‌టిగా ఆధునీక‌రిస్తామ‌ని ఆ సంఘం అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. ఉప్ప‌ల్ స్టేడియాన్నీ న‌వీక‌రించే ముందు ప్ర‌పంచంలోని అధునాత‌న క్రికెట్ మైదానాల‌ను ప‌రిశీలించి, క్షుణ్ణంగా అధ్యాయనం చేస్తామ‌న్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కోల్‌క‌తాలోని ప్ర‌ఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను జ‌గ‌న్ మోహ‌న్‌రావు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్య‌క్షుడు స్నేహాశిష్ గంగూలీతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. ఈ మ‌ధ్య కాలంలో స్టేడియం అభివృద్ధికి తీసుకున్న చ‌ర్య‌ల‌ను జ‌గ‌న్ మోహ‌న్ రావు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మైదానం మొత్తం అక్క‌డున్న సిబ్బందితో క‌లిసి ప‌రిశీలించారు. వ‌ర్షాల స‌మ‌యంలో త‌డిసిన పిచ్‌, అవుట్ ఫీల్డ్‌ను ఎలా వేగంగా ఆర‌బెడ‌తారు.. ఇందుకోసం ఎలాంటి యంత్రాలు ఉప‌యోగిస్తున్నారు, ఫ్ల‌డ్ లైట్ల ప‌నితీరు, సీటింగ్ సామ‌ర్థ్యం పెంపు వంటి విష‌యాల‌ను అక్క‌డి సిబ్బందిని అడిగి సావ‌ధానంగా జ‌గ‌న్ మోహ‌న్‌రావు తెలుసుకున్నారు. భ‌విష్య‌త్‌లో ప‌లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు ఉప్ప‌ల్‌ స్టేడియం ఆతిథ్య‌మివ‌నున్న నేప‌థ్యంలో క్రికెట‌ర్లు, మ్యాచ్‌ను వీక్షించేందుకు వ‌చ్చే అభిమానుల‌కు మంచి అనుభూతి క‌ల్గించేందుకు ఈ అధ్యాయ‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్ మోహ‌న్‌రావు చెప్పారు.

Also Read:  Vinesh Phogat : కర్తవ్యపథ్‌లో ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వదిలేసిన వినేశ్ ఫొగాట్