Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా వరల్డ్ కప్ లో హార్థిక్ దే కీ రోల్

టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Hardik Pandya: టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం , ముంబై జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోవడం ఫలితంగా ముంబై లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. దీంతో సారథిగా, ఆటగాడిగా విఫలమయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు వచ్చాయి.

పాండ్యా తన భార్యతో విభేదాలు వచ్చినట్టు, భరణం రూపంలో ఆస్తిని కోల్పోతున్నట్టు ఇలా పలు రకాల వార్తలు షికారు చేశాయి. దీనికి తోడు పాండ్యా ఒంటరిగా వెకేషన్ కు వెళ్లడంతో మరింత బలపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకున్న పాండ్యా వరల్డ్ కప్ లో తన ఆల్ రౌండర్ రోల్ కు న్యాయం చేశాడు. బంతితోనూ,బ్యాట్ తోనూ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకమయ్యాడు. 8 మ్యాచ్ లలో 144 పరుగులు చేసిన పాండ్యా 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మిల్లర్ ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. విజయం అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు.

తనను ఎన్నో మాటలన్నారని, ఇష్టానుసారం విమర్శించారంటూ తాజాగా భావోద్వేగానికి గురయ్యాడు. తన గురించి ఏం తెలియని వారు కూడా మాట్లాడడం బాధ కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాలమే వారందరికీ సమాధానం చెబుతుందంటూ పాండ్యా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Pomegranate – Banana : దానిమ్మను వీటితో కలిపి తింటే సమస్యలే !