Site icon HashtagU Telugu

Mohammed Shami: షమీపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. వీడియో

Mohammed Shami

Compressjpeg.online 1280x720 Image 11zon

Mohammed Shami: భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)పై ఒకప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన అతని భార్య హసిన్ జహాన్.. ఇప్పుడు మరోసారి మరో ప్రకటన చేసింది. ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన లక్ష్యం ఎవరినీ టార్గెట్ చేయడం కాదని, తన జీవితాన్ని గడపడమేనని అన్నారు. అలాగే షమీకి శుభాకాంక్షలు తెలిపేందుకు నిరాకరించింది.

నిజానికి 2023 ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతనికి తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. అయితే దీని తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసి గత నాలుగు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఈక్రమంలోనే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ మాజీ భార్య హసిన్ మాట్లాడుతూ.. నేను క్రికెట్ చూడను. నాకు క్రికెట్‌పై ఆసక్తి లేదు అని చెప్పింది. మహ్మద్ షమీ మంచిగా ఆడితే ఇండియన్ టీమ్‌లో కొనసాగుతాడని అభిప్రాయపడింది. అలా జరిగితే బాగా సంపాదించేందుకు వీలువుతుందని.. కుటుంబానికి కూడా అది మంచిదేగా అని చెప్పుకొచ్చింది.

Also Read: England vs Netherlands: నేడు ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్.. గెలుపెవరిదో..?

మహ్మద్ షమీ.. హసీన్ జహాన్‌ను 2014లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. అయితే 2018లో హసీన్ షమీపై వేధింపుల కేసు పెట్టింది. 2018 నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే గృహహింస కేసు కింద ఇటీవలే తీర్పునిచ్చిన కోల్‌కతా కోర్టు.. ప్రతినెలా హసీన్‌కు లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.