ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌లో కూడా హర్షిత్ ఎంపికయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Harshit Rana

Harshit Rana

Harshit Rana: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌లో కూడా హర్షిత్ ఎంపికయ్యాడు. కానీ అప్పుడు కూడా గాయం కారణంగానే అతను టోర్నీ నుండి వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం హర్షిత్ స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనే విషయంపై కేకేఆర్ ఫ్రాంచైజీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

టీ20 ప్రపంచకప్‌కు ముందే తగిలిన గాయం

హర్షిత్ రాణా టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతని మోకాలికి గాయమైంది. దీనివల్ల అతను టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచకప్ సమయంలోనే హర్షిత్ తన మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. మొదట అతను ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అతను ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. గత రెండు సీజన్లలో అతను కేకేఆర్ కోసం 34 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

కోల్‌కతాకు పెరిగిన కష్టాలు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో హర్షిత్ రాణా ఒక కీలకమైన ఆల్‌రౌండర్. గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అతను టోర్నీకి దూరం కావడం ఫ్రాంచైజీకి పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పటికే జట్టు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేసింది. అయితే అతని స్థానంలో జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజారబానీని జట్టులోకి తీసుకుంది. ముజారబానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)ను వదిలి ఐపీఎల్‌లో భాగం కానున్నాడు. అయినప్పటికీ హర్షిత్ రాణా స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనే విషయంపై కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

  Last Updated: 13 Mar 2026, 08:29 PM IST