Site icon HashtagU Telugu

T20 World Cup squad: అతను ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిందే

ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న బౌలర్లలో హర్షల్ పటేల్ కూడా ఒకడు. ఐపీఎల్ లో అదరగొట్టి సఫారీ సిరీస్ కు ఎంపికైన హర్షల్ తన ఫామ్ కొనసాగించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా భువనేశ్వర్‌ కుమార్‌ నిలిచినా.. వికెట్లు ఎక్కువ తీసుకున్నది మాత్రం హర్షలే. తాజాగా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్‌ ట్రంప్‌ కార్డ్స్‌లో హర్షల్ ఒకడని వ్యాఖ్యానించాడు. అతన్ని కొత్త బాల్‌ బౌలర్‌గా కూడా ఉపయోగించవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటి బౌలర్‌ ఉండటం ఏ కెప్టెన్‌కైనా మేలు చేస్తుందని సన్నీ వ్యాఖ్యానించాడు. పవర్‌ ప్లేలో కూడా చక్కగా బౌలింగ్ చేసే సత్తా హర్షల్ కు ఉండడం జట్టుకు కలిసొస్తుందని గవాస్కర్ విశ్లేషించాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ కూడా హర్షల్ పటేల్ బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం భారత జట్టుకు హర్షల్‌ పెద్ద ఆస్తిగా అభివర్ణించాడు. హర్షల్ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడనీ, డెత్‌ ఓవర్లలో స్లో బాల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడని గుర్తు చేశాడు. ఒత్తిడిలోనూ రాణిస్తుండడం అతనికి కలిసొస్తుందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా సిరీస్ లో హర్షల్‌ 7.23 ఎకానమీ రేటుతో 7 వికెట్లు తీశాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్… ఈ సారి 15 మ్యాచ్ లలో 19 వికెట్లు పడగొట్టాడు.

బుల్లెట్ రైలు వ‌చ్చేస్తుదండీ.. మూడు గంట‌ల్లో ముంబైకి!

Exit mobile version