Site icon HashtagU Telugu

Rohit Fitness: రోహిత్‌పై ఘాటు వ్యాఖ్యలు… బరువు తగ్గాలంటూ దిగ్గజ క్రికెటర్‌ ఫైర్..!

Kapil Dev Rohit Sharma Playing 11

Kapil Dev Rohit Sharma Playing 11

Rohit Fitness: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కపిల్‌ దేవ్‌ మాట్లాడాడు. రోహిత్‌ శర్మ ఓవర్‌ వెయిట్‌పై అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్‌ శర్మ సిగ్గు పడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీవీల్లోచూస్తే హిట్‌మ్యాన్‌ అస్సలు ఫిట్‌గా కనిపించడని, 140 కోట్లకు పైగా భారతీయులను రెప్రజెంట్‌ చేసే భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఫిట్‌గా లేకపోవడం అవమానకరమంటూ సరికొత్త వివాదానికి తెరలేపాడు.

ఇంకా కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ.. టీవీల్లో చూసేందుకు నేరుగా చూసేదానికి చాలా వ్యత్యాసముంటుందన్నారు. లావుగా ఉన్నవారు సైతం టీవీల్లో సన్నంగా కనపడతారని అన్నా డు. ఇంతటితో కపిల్‌ ఆగలేదు. రోహిత్‌ను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ విరాట్‌ కోహ్లితో పోలుస్తూ ఇరు స్టార్‌ క్రికెటర్ల ఫ్యాన్స్‌ కొట్టుకునేందుకు కావాల్సి మసాలాను అందించాడు. కెప్టెన్‌ అనే వాడు జట్టు సభ్యులకు ఆదర్శంగా ఉండాలన్నాడు. ఈ విషయంలో కోహ్లి యావత్‌ క్రీడా ప్రపంచానికే ఆదర్శమని పరుగుల యంత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని చూస్తే ఫిట్‌నెస్‌ అంటే ఇదీ అనేలా ఉంటాడని ఆకాశానికెత్తాడు.

రోహిత్‌పై కపిల్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, హిట్‌మ్యాన్‌ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను అస్సలు జీర్ణించుకోలేరు. రోహిత్‌-కోహ్లి అభిమానులు ఇప్పుడిప్పుడే కలిసిపోతుండగా, కపిల్‌ నిప్పు రగిల్చాడు. అయితే ‌రోహిత్‌ ఫిట్‌నెస్‌, అతని బరువుపై చాలాకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నా యి. గతంలో చాలామంది దిగ్గజాలు కూడా హిట్‌మ్యాన్‌ బరువు తగ్గాలని సూచించారు. రోహిత్‌ ఓవర్‌ వెయిట్‌ కొన్ని సందర్భాల్లోఆటపై కూడా ప్రభావం చూపింది. ‌రోహిత్‌పై గతంలో ఈ తరహా కామెంట్స్‌ చేసిన వారిని ఫ్యాన్స్‌ ఆడుకున్నా రు.