Harmanpreet: హర్మన్ జోరు…ఇంగ్లాండ్ బేజారు

ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అదరగొడుతోంది. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన భారత సారథి రెండో వన్డేలో చెలరేగి పోయింది.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 10:58 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అదరగొడుతోంది. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన భారత సారథి రెండో వన్డేలో చెలరేగి పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న హర్మన్ ప్రీత్ ఫోర్లు , సిక్సర్లతో విరుచుకుపడింది. షేఫాలి వర్మ 8 , మందాన 40 , భాటియా 26 రన్స్ కే ఔటవదంతో భారత్ 99 రన్స్ కు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హర్మన్ ప్రీత్ , డియోల్ ఇన్నింగ్స్ గాడిన పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 113 పరుగులు జోడించారు. డియోల్ 58 రన్స్ ఔటవగా…చివర్లో హర్మన్ ప్రీత్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించింది.

ఒక దశలో 290 రన్స్ చేస్తుందనుకున్న టీమిండియా 333 రన్స్ చేసిందంటే దానికి కారణం హర్మన్ ప్రీత్ దూకుడే. ముఖ్యంగా చివరి 4 ఓవర్లలో బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కెరీర్ లో 5వ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి 3 ఓవర్లలో భారత్ 63 రన్స్ చేసిందంటే హర్మన్ దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ పై వన్డేల్లో భారత్ కి ఇదే అత్యధిక స్కోర్. హర్మన్ ప్రీత్ 111 బంతుల్లో 18 ఫోర్లు , 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.