Indian Women Team: కొత్త కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్

మిథాలీ రిటైర్ మెంట్ తో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలను బీసీసీఐ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించింది.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 10:05 AM IST

మిథాలీ రిటైర్ మెంట్ తో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలను బీసీసీఐ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది. 2019లోనే మిథాలీ రాజ్‌ టీ ట్వంటీ ల నుంచి రిటైర్ కావడంతో అప్పుడే ఈ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ను ప్రకటించారు. ఇప్పుడు వన్డేలకు కూడా ఆమెనే కెప్టెన్‌ అయింది. అయితే బీసీసీఐ మాత్రం శ్రీలంక టూర్‌కు హర్మన్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. కానీ సిరీస్‌ తర్వాత కూడా ఆమెనే కెప్టెన్‌గా కొనసాగుతుందా, టెస్టు సారథ్యాన్నీ ఆమెకే అప్పగిస్తారా అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు.ఇదిలా ఉంటే వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది.

రిటైర్మెంట్‌పై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ స్పందించింది. క్రికెట్‌ అనేది ఓ కల. నేను నా కెరీర్‌ ప్రారంభించినప్పుడు అసలు నాకు మహిళల క్రికెట్‌ ఉందా అనేది కూడా తెలియదు కానీ నేను విన్న ఒకే ఒక్క పేరు మిథాలీ. యంగ్‌ గర్ల్స్‌ ఈ గేమ్‌ను కెరీర్‌గా తీసుకొని, పెద్ద కలలు కనేలా చేసింది మీరే. మీ జీవితంలో అంతా మంచే జరగాలని హర్మన్‌ ట్వీట్‌ చేసింది. రాబోయే శ్రీలంక టూర్‌లో ఆడే వన్డే, టీ20 సిరీస్‌లకు హర్మన్‌ కెప్టెన్‌గా ఉంటుంది. దీంతో పాటు ఈ నెల చివరి వారంలో శ్రీలంక టూర్ కోసం కూడా జట్టును ప్రకటించింది. మరోవైపు వెటరన్‌ పేస్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామికి వన్డే టీమ్‌లో చోటు దక్కలేదు.
టీ20 ప్రపంచకప్ సందర్భంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురైన జెమీమా రోడ్రిగ్స్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఇటీవల ముగిసిన టీ ట్వంటీ ఉమెన్స్ ఛాలెంజ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన జెమీమా 45.00 సగటుతో 90 పరుగులు చేసింది. అయితే ఆమెకు కేవలం టీ 20 జట్టులో మాత్రమే చోటు దక్కింది. ఇక భారత మహిళల జట్టు
ఈ నెల 23 నుంచి 27 వరకూ డంబులాలో మూడు టీ ట్వంటీలు, ఆ తర్వాత జులై 1 నుంచి 7 వరకూ కాండీలో మూడు వన్డేలు ఆడనుంది.