T20 I : మిథాలీ రికార్డుపై కన్నేసిన హర్మన్

భారత మహిళల క్రికెట్ లో మిథాలీరాజ్ ఎన్నో రికార్డులు సృష్టించింది. సుధీర్ఘమైన కెరీర్ కు ఇటీవలే మిథాలీ గుడ్ బై చెప్పడంతో హర్మన్ ప్రీత్ కు జట్టు పగ్గాలు అప్పగించారు.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 05:37 PM IST

భారత మహిళల క్రికెట్ లో మిథాలీరాజ్ ఎన్నో రికార్డులు సృష్టించింది. సుధీర్ఘమైన కెరీర్ కు ఇటీవలే మిథాలీ గుడ్ బై చెప్పడంతో హర్మన్ ప్రీత్ కు జట్టు పగ్గాలు అప్పగించారు. మిథాలీ కెప్టెన్సీని రీప్లేస్ చేసిన హర్మన్ ఆమె రికార్డులపైనా కన్నేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ టీ ట్వంటీల్లో అరుదైన రికార్డ్ అందుకునేందుకు చేరువలో నిలిచింది. శ్రీలంకతో జరగనున్నటీ20 సిరీస్‌లో హర్మన్‌ మరో 45 పరుగులు సాధిస్తే షార్ట్ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. 21 టీ ట్వంటీల్లో 2319 పరుగులు చేసిన హర్మన్‌ శ్రీలంకతో సిరీస్‌లో మరో 45 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్ పేరిట ఉన్న అ‍త్యధిక టీ20 పరుగుల రికార్డును అధిగమిస్తుంది. మిథాలీ రాజ్ 89 మ్యాచ్‌ల్లో 17 అర్ధ సెంచరీల సాయంతో 37.52 సగటున 2364 పరుగులు సాధించగా..దీనిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే హర్మన్ కెరీర్ లో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉండగా..బిగ్ బాష్ వంటి లీగ్స్ లో దూకుడుగా ఆడుతూ డాషింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో 3 టీ ట్వంటీలు, 3 వన్డేలు ఆడనుంది. జూన్‌ 23, 25, 27 తేదీల్లో జరిగే టీ ట్వంటీలకు దంబుల్లా ఆతిథ్యమిస్తుండగా.. జులై 1, 4, 7 తేదీల్లో పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ జరగనుంది.