Site icon HashtagU Telugu

Haris Rauf: అభిమానితో పాక్ బౌలర్ గొడవ.. అసలేం జరిగింది?

Haris Rauf

Haris Rauf

Haris Rauf: టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాక్ ఏ మాత్రం రాణించలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ సూపర్-8కి కూడా చేరుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టు ఆటతీరుపై పాక్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. దీంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్లను దుర్భాషలాడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ అభిమాని సెల్ఫీ అడగడంతో పాక్ క్రికెటర్ హరీస్ రవూఫ్ ఆగ్రహానికి గురయ్యాడు. కొట్టడానికి కూడా వెనకాడలేదు. ఆగ్రహంతో ఉన్న హరీస్ రవూఫ్ ని భార్య కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అభిమానిని కొట్టడానికి పరుగులు తీశాడు. అయితే అక్కడున్న వాళ్ళు అతడిని అడ్డుకున్నారు. లేకుంటే గొడవ చాలా పెద్దదిగా మారేది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే గొడవ అనంతరం హరీస్ రవూఫ్ స్పందించాడు. హరీస్ రౌఫ్ తన భార్యతో కలిసి వెళ్తున్న క్రమంలో సమీపంలో నిలబడిన అభిమానులు రవూఫ్ మరియు అతని కుటుంబ సభ్యులపై అనుచిత పదజాలంతో దూషించినట్లు చెప్పాడు.

పబ్లిక్ ఫిగర్ కావడంతో అభిమానుల నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పొగడడానికి లేదా విమర్శించే హక్కు వాళ్లకు ఉంది కానీ నా కుటుంబం జోలికి వస్తే సహించను. ఏ వృత్తిలో ఉన్నా కుటుంబానికి గౌరవం ఇవ్వడం ముఖ్యమని చెప్పాడు ఈ స్టార్ బౌలర్. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచకప్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్ ప్రదర్శన నిరాశపరిచింది. 4 మ్యాచ్‌లలోకేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక పాకిస్థాన్ తొలి మ్యాచ్ లో అమెరికా చేతిలో ఓడిపోయింది, ఆ తర్వాత టీమిండియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత కెనడా మరియు ఐర్లాండ్‌లను ఓడించింది. అయినప్పటికీ సూపర్-8కి అర్హత సాధించలేకపోయింది. దీంతో టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.

Also Read: Vadhavan Port: మహారాష్ట్రలో 76,220 కోట్ల భారీ ఓడరేవుకు మోడీ సర్కార్ ఆమోదం