Site icon HashtagU Telugu

Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

Harika Imresizer

Harika Imresizer

చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కాంస్య పతకం నెగ్గింది. తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే హారిక ఎన్నో పతకాలను నెగ్గింది. కానీ ఈ పతకం మాత్రం తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసిందని చెప్పాలి. ఎందుకంటే హారిక ఇప్పుడు తొమ్మిది నెలల గర్భిణీ. అయినా కూడా చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంది. నెలలు నిండినా…ధైర్యం కోల్పోకుండా ఆటలో రాణిస్తూ…ఈ పతకం సాధించింది.

ఈ విషయాన్ని హారిక బావ, టాలీవుడ్ డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తొమ్మిది నెలల గర్భంతో మెడలో తాను గెలిచిన పతకాన్ని వేసుకుని హారిక తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు బాబీ. చెస్ పట్ల హారికకు ఉన్న అంకితభావాన్ని కీర్తించారు. దేశం కోసం ఏదో సాధించాలన్న హారిక తపన, ఆమెలోని పోరాట పటిమ తనకు ఎంతో గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు.