Site icon HashtagU Telugu

Pandya Stepbrother: హార్దిక్ పాండ్యా సోద‌రుడు అరెస్ట్‌.. కార‌ణ‌మిదే..!

Pandya Stepbrother

Safeimagekit Resized Img (3) 11zon

Pandya Stepbrother: క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాను మోసం చేశాడనే ఆరోపణలపై అతని మ‌రో సోదరుడిని (స‌వ‌తి త‌ల్లి) బుధవారం పోలీసులు అరెస్ట్ (Pandya Stepbrother) చేశారు. ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారుల కథనం ప్రకారం.. సవతి సోదరుడు వైభవ్ పాండ్యా (37) ముంబైకి చెందిన భాగస్వామ్య సంస్థ నుండి సుమారు రూ. 4.3 కోట్లను దారి మ‌ళ్లీంచిన‌ట్లు తెలుస్తోంది. తద్వారా అతని సోదరుడు కృనాల్ పాండ్యాకు నష్టం వాటిల్లింది.

వైభవ్‌పై మోసం, ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. నిజానికి 2021లో ముగ్గురూ సంయుక్తంగా పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. భాగస్వామ్య నిబంధనలు ఏమిటంటే.. క్రికెటర్, అతని సోదరుడు ఒక్కొక్కరు 40% మూలధనాన్ని వెచ్చిస్తారు. అయితే సవతి సోదరుడు 20 శాతం నిధులను వెచ్చిస్తారు. సంస్థ నిర్వహణకు పూర్తి బాధ్యత వహిస్తారు. వ్యాపారం ద్వారా వచ్చే లాభాలను కూడా అదే నిష్పత్తిలో పంపిణీ చేయాలి.

Also Read: Anil Ambani : అనిల్ అంబానీకి సుప్రీం కోర్ట్ భారీ షాక్ ..

అయితే సవతి సోదరుడు నిబంధనలను ఉల్లంఘించాడు. క్రికెటర్, అతని సోదరుడికి తెలియజేయకుండా అదే వ్యాపారంలో మరొక సంస్థను ప్రారంభించాడు. దీని వల్ల ప్రధాన కంపెనీకి రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని ఒక మూలాధారం తెలిపింది. సవతి సోదరుడు రహస్యంగా తన లాభాన్ని 20% నుంచి 33.3%కి పెంచాడని, దీంతో క్రికెటర్‌కి, అతని సోదరుడికి నష్టం వాటిల్లిందని స‌మాచారం. సవతి సోదరుడు భాగస్వామ్య సంస్థ ఖాతా నుంచి తన ఖాతాలోకి మళ్లించుకున్న‌ట్లు ఆరోపిస్తున్నారు.

దీనిపై పాండ్యా సోదరులు తమ సోదరుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతడు వారిని బెదిరించాడు. దీనికి సంబంధించి కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా వైభవ్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. IPL 2024లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, KL రాహుల్ కెప్టెన్‌గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కృనాల్ పాండ్యా ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. దీనికి ముందు ఇద్దరూ అంబానీ ఫ్యామిలీ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చాలా కాలం పాటు కలిసి ఆడారు.

We’re now on WhatsApp : Click to Join