Site icon HashtagU Telugu

Hardik Pandya: రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాకే!

Page

Page

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అదేంటి పాండ్యాకు ఇప్పటికే బాలీవుడ్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు కదా..? పాండ్యా, నటాషాకు ఓ కొడుకు కూడా ఉన్నాడు కదా..? పాండ్యా ఎప్పుడు విడాకులు తీసుకున్నాడు. కొత్త పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్నలు మీ మదిలో ప్రశ్నలు వచ్చేసి ఉంటాయి. అయితే ఇప్పుడు చూద్దాం రెండోసారి ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో.

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ పీకల్లోతు ప్రేమించుకున్నారు. ఎవరి కళ్లకు కనిపించికుండా సైలెంట్‌గా పలు దేశాలు తిరిగేశారు. చిన్న గ్యాప్‌ వస్తే చాలు… సైలెంట్‌గా విదేశాలకు చెక్కేసేవాడు హార్దిక్‌ పాండ్యా. లవ్‌ని చాలా సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా.. మన సోషల్‌ మీడియా ఉంచదు కదా. సో ఆ నోట.. ఈ నోట పాకి… మీడియో మెట్లు ఎక్కేసింది. ఆ తర్వాత… 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లోని సముద్రంలో విహరిస్తూ నటాషా చేతికి పాండ్యా ఉంగరం తోడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. నటాషా కూడా పాండ్యా ప్రేమను అంగీకరించింది. ఉంగరం తొడిగి ఎంగేజ్‌మెంట్‌ అయిందని కూడా భారత ప్లేయర్ పేర్కొన్నాడు. ఆపై కుటుంబ సభ్యుల సమక్షంలో నటాషాను పాండ్యా పెళ్లి చేసుకున్నాడు. ఇక 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భవతి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 2020 జులైలో నటాషా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబు పేరు అగస్త్య పాండ్యా.

2020 లాక్‌డౌన్‌లో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో సంప్ర‌దాయబద్దంగా ఇంకోసారి వివాహం చేసుకోవాల‌ని పాండ్యా అప్పటినుంచే భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 14న హార్దిక్-న‌టాషాలు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారట. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఫిబ్రవరి 13 నుంచి ఈ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయట. వెడ్డింగ్‌ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ కార్యక్రమాలతో హార్దిక్, నటాషా పెళ్లి వైభవంగా జరగనుందట.