LSG vs MI: హార్దిక్ పాండ్యాకు 24 లక్షల జరిమానా

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 24 లక్షల జరిమానా పడింది.

Published By: HashtagU Telugu Desk
LSG vs MI

LSG vs MI

LSG vs MI: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 24 లక్షల జరిమానా పడింది. హార్దిక్ ఒక్కడే కాకుండా మొత్తం జట్టు కూడా మూల్యం చెల్లించుకుంది. కాగా లక్నోపై ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌లలో 7 మ్యాచ్ లు ఓడింది.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.24 లక్షల జరిమానా పడింది. ఇది కాకుండా ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ఇతర ఆటగాళ్లు కూడా శిక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడటం ఇది రెండవసారి. అందుకే మొత్తం జట్టు శిక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన 11 మంది సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.

We’re now on WhatsApp : Click to Join

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్‌జెయింట్‌ మరో 4 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్ ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు 9వ స్థానంలో ఉంది.

Also Read: YS Sharmila : జగన్ కు షర్మిల బహిరంగ లేఖ…

  Last Updated: 01 May 2024, 12:57 PM IST