Hardik Pandya: ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరం, ఎందుకో తెలుసా..?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడుసార్లు స్లో ఓవర్ వేస్తే జట్టు కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. గత సీజన్లో ముంబై మూడు సార్లు స్లో ఓవర్ వేయడంతో ఆ ఎఫెక్ట్ కెప్టెన్ హార్దిక్ పై పడింది.

Published By: HashtagU Telugu Desk
Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: ఐపీఎల్ కి సన్నాహాలు ఊపందుకున్నాయి. ధనా ధన్ లీగ్ కి ముందు ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో ఊచకోత కోస్తున్నారు. గత సీజన్లో ప్లాప్ అయిన ఆటగాళ్లు వచ్చే సీజన్లో తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఫ్రాంచైజీ ఓనర్లు కూడా తమ ప్లేయర్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వచ్చే సీజన్లో ఆ పరిస్థితి ఉండకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటుంది.

వేలంలో మ్యాచ్ విన్నర్లను ఎంపిక చేసిన ముంబై, టైటిల్ లక్ష్యంగా వాళ్ళను సిద్ధం చేస్తుంది. గతేడాదే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. తన కెప్టెన్సీలో ముంబై విఫలమైనప్పటికీ వచ్చే సీజన్లోనూ మళ్ళీ హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయంపై ముంబై యాజమాన్యం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే ముంబై ఇండియన్స్ తలపడే తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరమవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. స్లో ఓవర్ రేటింగ్ కారణంగా కెప్టెన్ హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడుసార్లు స్లో ఓవర్ వేస్తే జట్టు కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. గత సీజన్లో ముంబై మూడు సార్లు స్లో ఓవర్ వేయడంతో ఆ ఎఫెక్ట్ కెప్టెన్ హార్దిక్ పై పడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ వచ్చే సీజన్లో ఆరంభం మ్యాచ్ కి దూరం కానున్నాడు.

Also Read: Vijayasai Reddy : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై..?

హార్దిక్ తొలి మ్యాచ్ కి దూరం కావడంతో కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేసులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే ఐదు సార్లు జట్టును విజయపధంలో నడిపించిన రోహిత్ పై ముంబై యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది.మరోవైపు హార్దిక్ కూడా గుజరాత్ ని తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలబెట్టాడు. విశేషమేంటంటే హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ రెండో సీజన్లో రన్నరప్ గా నిలిచింది. 2023 సీజన్లో టైటిల్ పోరులో చెన్నై, జీటీ పోటీ పడగా చెన్నై విజయం సాధించి ఐదో టైటిల్ ని కైవసంచేసుకుంది.

  Last Updated: 24 Jan 2025, 07:20 PM IST