Hardik Pandya: భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ డిసెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడనుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ ఇటీవలే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది. జట్టుకు ఐదు కప్పులు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి పాండ్యాకు ఈ అవకాశం లభించింది. దీంతో రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. దీంతో ముంబయి ఇండియన్స్ కూడా నష్టపోయింది. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్‌ని లక్షలాది మంది అన్‌ఫాలో చేశారు. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఆడే అవకాశం తక్కువగా ఉండటంతో ముంబై ఇండియన్స్ మళ్లీ రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగిస్తారా? లేక మరెవరికైనా జట్టు పగ్గాలు అప్పజెప్తారా అన్నది తేలాల్సి ఉంది.
హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ 2023లో గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో ఆడుతున్నప్పుడు అతని కాలికి గాయమైంది. అనంతరం అతడిని పరీక్షించగా గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది. దీంతో అతను ప్రపంచకప్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. గాయం పూర్తిగా నయం కాకపోతే అతను ఐపీఎల్‌లో ఆడలేడు.
Also Read: Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!