Hardik Pandya : అతడే ఒక సైన్యం!

IPlలో కెప్టెన్ అడుగుపెట్టాడు..తన సత్తా చూపించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. జట్టును ముందుండి నడిపించడంలో పాండ్యా సక్సెస్ అయ్యాడు.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 01:56 PM IST

జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడే మనలోని బలంబలహీనతలు బయటపడతాయి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. పైగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన పాండ్యాకు అనుభవం కూడా తక్కువే. కానీ ఒత్తిడిని చిత్తు చేస్తూ, జట్టులో బలం నింపుతూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పాండ్యా ఓ గెలుపు గుర్రం అని చెప్పక తప్పదు.

IPLలో కెప్టెన్ అడుగుపెట్టాడు..తన సత్తా చూపించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. జట్టును ముందుండి నడిపించడంలో పాండ్యా సక్సెస్ అయ్యాడు. తొలి క్వాలిఫైయర్ లో అద్బుతమైన ఆటతీరు కనబర్చారు. ఫైనల్ కు చేరాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా బంతితో, బ్యాటుతో రాణించాడు. జట్టుకు తొలి సీజన్లోనే IPL Title అందించాడు. ఫైనల్లో ఫేవరేట్ గా బరిలో దిగిన గుజరాత్ జట్టు ఈజీగా విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ జట్టు…బ్యాటర్లు విఫలమయ్యారు. కేవలం 130 పరుగులు మాత్రమే చేశారు. అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మొదటి రెండు వికెట్లు త్వరగానే పడ్డాయి.

అలాంటి సమయంలో శుభ్ మన్ గిల్ కు జతగా పాండ్యా జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే చాహల్ అతన్ని బోల్తా కొట్టించడంతో పాండ్యా అవుటైన తర్వాత మిల్లార్ వచ్చాడు. మరోసారి తన ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. మిగతా బ్యాటర్లు భారీ షాట్స్ ఆడేందుకు కష్టపడిన పిచ్ పై తన మాత్రం ధారాళంగా పరుగులు చేశాడు. ఫలితంగా జట్టుకు విజయాన్ని అందించాడు. మిల్లార్ ఊపును చూసిన గిల్ కూడా రెచ్చిపోయి ఆడాడు. 19వ ఓవర్లో తొలిబంతికే సిక్సర్ తో మ్యాచ్ ను ముగించేసాడు. దీంతో గుజరాత్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తొలి సీజన్లోనే IPL Trophy అందుకుంది. రాజస్తాన్ బౌలర్లలో బౌల్డ్, ప్రసిద్ద్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.

Pic: Twitter