Hardik Pandya: కొడుకు అగస్త్య పుట్టినరోజు సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నేటితో అగస్త్యకు 4 సంవత్సరాలు నిండాయి. ప్రతి పుట్టినరోజు నాడు కొడుకుతో గడిపే హార్దిక్ ఈ సారి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో అగస్త్యను ఎంతో మిస్ అవుతున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ కి ఎంతో ఇష్టమైన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని ఎమోషనలయ్యాడు.
వీడియోలో హార్దిక్, అగస్త్య క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అందర్నీ కూడా భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటాషా స్టాంకోవిచ్ ముంబై వదిలి సెర్బియా వెళ్లిపోయింది. ముంబై విమానాశ్రయంలో కుమారుడు అగస్త్యని ఆమె తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అగస్త్య ఎంతో క్యూట్ గా ఇండియాకు బై చెప్తున్నట్టు కొన్ని క్లిప్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే పాపం అగస్త్యకు తన ఫాదర్ ని విడిచి వెళ్తున్నట్లు తెలియకపోవచ్చు. పేరెంట్స్ డివోర్స్ తీసుకున్న విషయం అర్ధం కాకపోవచ్చు.ఇక అగస్త్య మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం లేకపోవచ్చు. నటాషాకు కూడా ఇండియాకు సంబంధాలు తెగిపోయాయి. సెర్బియాకు వెళ్లిన ఆమె కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.ఇటీవల ఆమె తన కుమారుడితో కలిసి పార్కుకు వెళ్లగా ఆ ఫోటోలను ఆమె షేర్ చేసింది. అయితే అగస్త్యను చూసి హార్దిక్ రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాడు. ఆ ఫోటోకి హార్దిక్ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో కొడుకు అగస్త్య కోసమైనా హార్దిక్, నటాషా మాల్లీ కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రెండేళ్లుగా హార్దిక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టుకు కొన్నాళ్ళు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్ సీజన్లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. కానీ అతని కెప్టెన్సీలో జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజాగా భారత్ టీ20 ప్రపంచకప్‌గెలుచుకుంది. ఈ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక పర్యటనలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకుంటారని అంతా భావించారు.కానీ కెప్టెన్‌ని చేయకపోవడం పక్కనపెడితే కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా చేయలేదు.ఇక ఆ తర్వాత వన్డే సిరీస్కు కూడా హార్దిక్ ను సెలెక్ట్ చేయలేదు. దీంతో అతని వన్డే కెరీర్ పై కూడా అనుమానాలు లేవనెటుతున్నాయి. ఇలా హార్దిక్ పడుతూ లేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు.
Also Read: Paris Olympics: 124 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మను భాకర్