Site icon HashtagU Telugu

Hardik Pandya: కొడుకును క‌లిసిన హార్ధిక్ పాండ్యా.. ఫొటోలు వైర‌ల్‌..!

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ ఇండియాకు తిరిగి వచ్చారు. గత మంగళవారం కొడుకు అగస్త్యను తండ్రి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇంట్లో దించారు. ఈ సమయంలో హార్దిక్ తన కొడుకును కలిసిన తర్వాత చాలా సంతోషంగా కనిపించాడు. వీరి క్యూట్ మూమెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఒక నెల తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వ‌చ్చింది. హార్దిక్ కూడా తన కుమారుడు అగస్త్యను కలవాలని తహతహలాడాడు. ఒక నెల తర్వాత తన కొడుకును కలిసిన తర్వాత క్రికెటర్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రీకొడుకులు కలిసి ఉండటంతో అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు

హార్దిక్ పాండ్యా కోడలు పంఖురి శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని చిత్రాలను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ క‌థనంలో హార్దిక్, అతని కుమారుడు అగస్త్య ఫొటోల‌ను పంచుఉంది. ఇందులో తండ్రి- కొడుకుల అందమైన క్షణం తెరపైకి వచ్చింది. ఇంతలో మరొక చిత్రం బయటపడింది. అందులో పంఖురి పుస్తకం చదువుతున్నట్లు కనిపించింది. అగస్త్య, అతని కజిన్ సోదరుడు కూడా ఆమెతో ఉన్నారు.

Also Read: Become Rich: 43 రోజుల‌పాటు ఇలా చేస్తే ధ‌న‌వంతుల‌వుతారు.. ఏం చేయాలంటే..?

నటాషా ఒక నెలపాటు సెర్బియాలో ఉంది

హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు తిరిగి వెళ్లింది. దాదాపు నెల రోజులుగా హార్దిక్ తన కుమారుడికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు నటాషా తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తండ్రీ కొడుకులను కలవడానికి న‌టాషా.. అగస్త్యను హార్దిక్ పాండ్యా ఇంట్లో వ‌దిలేసింది.

We’re now on WhatsApp. Click to Join.

4 ఏళ్ల తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు

నటాషా స్టాంకోవిచ్- హార్దిక్ పాండ్యా 2020 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు వారిద్దరూ ఏడాది పాటు సహజీవనం చేశారు. 2023లో వారిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికే నటాషా, హార్దిక్ విడిపోయిన‌ట్లు ధృవీకరించారు. నాలుగేళ్లుగా క‌లిసి ఉన్న వారిద్దరూ ఎట్టకేలకు విడిపోతున్నామంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

విడాకులకు కారణం ఏమిటి?

నటాషా- హార్దిక్ విడిపోవడానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. మీడియా నివేదికల ప్రకారం క్రికెటర్ తన సరదా జీవితంలో చాలా బిజీగా ఉన్నాడని, దాని కారణంగా నటాషా ఒంటరిగా ఉందని చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్యా అసహనం, వ్యక్తిత్వంలో చాలా తేడా వచ్చింది. నటాషా తన సంబంధాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిందని, కానీ ఏమీ ఫలించలేదని నివేదికలు సూచించాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.