Site icon HashtagU Telugu

world cup 2023: హార్దిక్ పాండ్య హెల్త్ రిపోర్ట్..

World Cup 2023 (52)

World Cup 2023 (52)

world cup 2023: ప్రపంచ కప్ లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ ని డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత్ ఆడిన ఐదు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. టీమిండియా చివరిగా న్యూజిలాండ్ తో హోరాహోరీగా తలపడింది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో విజయం నల్లేరు మీద నడకలా సాగింది.

టీమిండియా ఆటగాళ్లు లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ కోసం సిద్దపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కి కూడా హార్దిక్ పాండ్య ఉంటాడా లేదా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్య గాయపడ్డ విషయం తెలిసిందే. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపేందుకు ప్రయత్నించగా కాలు బెణకడంతో హార్దిక్ మ్యాచ్ మద్యలోనే స్టేడియాన్ని వదిలాడు. ప్రస్తుతం హార్దిక్ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ ఎన్సీఎలో చికిత్స తీసుకుంటున్నాడు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపారు. స్కాన్‌ రిజల్ట్స్‌ను విశ్లేషించి హార్ధిక్‌కు అయిన గాయం కేవలం బెణుకు మాత్రమే అని దానివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో హార్దిక్ ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఆడనున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా గత మ్యాచ్ లో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగాడు. మరోవైపు శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో మహ్మద్‌ షమీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ కీలక మ్యాచ్ లో షమీ ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే టీమిండియా భీకర ఫామ్ లో ఉంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడి ఆసీస్ ను చిత్తు చేసింది. అదే జోరును అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్లను ధీటుగా ఎదుర్కొంది. కాగా బలమైన టీమ్స్ ని మట్టికరిపించిన టీమిండియాకు ఇంగ్లండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

Also Read: World Record : 3.25 లక్షల శానిటరీ ప్యాడ్ ల పంపిణీ.. నారీశక్తి ప్రపంచ రికార్డు

Exit mobile version