Hardik Pandya: గుజరాత్ కు బిగ్ షాక్.. ముంబైకి స్టార్ ఆల్ రౌండర్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై జట్టుకు తిరిగి వెళ్ళిపోనున్నాడు. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 10:10 AM IST

Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ 19న దుబాయ్ లో జరిగే మినీ వేలంతో హడావుడి షూరు కానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్స్ జాబితాను ఖరారు చేసుకున్నాయి. వేలంలో కొత్తవారిని తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ట్రేడింగ్ విండో ద్వార మరికొందరు ఆటగాళ్ళ జట్లు మారనున్నాయి. దీనిలో భాగంగా గుజరాత్ టైటాన్స్ కు షాక్ తగిలనుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై జట్టుకు తిరిగి వెళ్ళిపోనున్నాడు. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో ఇదే అతిపెద్ద డీల్ గా ఉండనుంది.

పాండ్యాను 15 కోట్ల రూపాయలకు గుజరాత్ రెండేళ్ళ క్రితం దక్కించుకుంది. ఇప్పుడు అదే మొత్తంతో తన పాత జట్టుకు అతను తిరిగి రానున్నాడు. దీనిపై రెండు ఫ్రాంచైజీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ముంబై జట్టులో ఇతర ప్లేయర్స్ ను రిలీజ్ చేసే జాబితా ఇంకా ఖరారు కాకపోవడంతో అధికారిక ప్రకటన ఆలస్యమవుతోంది.

Also Read: IPL 2024 Auction: ఈ కివీస్ ఆటగాడిపై కాసులు కురిపించనున్న ఐపీఎల్ వేలం.. రూ.40 కోట్ల వరకు బిడ్లు..?

పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఏడు సీజన్లలో ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారిపోవడమే కాదు టైటిల్ విజయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 92 మ్యాచ్ లలో 1476 పరుగులు చేయడంతో పాటు బంతితోనూ రాణించి 42 వికెట్లు పడగొట్టాడు. 2022 ఐపీఎల్ మెగా వేలంలో అనూహ్యంగా గుజరాత్ టైటిన్స్ పాండ్యాను దక్కించుకుంది. కెప్టెన్ గా జట్టుకు టైటిల్ అందించిన పాండ్యా ఆల్ రౌండర్ గా తనపై అంచనాలను నిలుపుకున్నాడు. 31 మ్యాచ్ లలో 37.86 యావరేజ్ తో 833 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యాను ముంబై ముందుచూపుతోనే తీసుకుంటున్నట్టు భావిస్తున్నారు. రోహిత్ శర్మ వారసునిగా భవిష్యత్తులో ముంబై కెప్టెన్సీ పాండ్యాకు అప్పగించే అవకాశముంది. మొత్తం మీద పాండ్యా ట్రేడింగ్ డీల్ పై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

We’re now on WhatsApp. Click to Join.