Hardik Pandya: పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన తొలి ఓవర్ వేస్తుండగా గాయపడ్డాడు. గాయం తర్వాత మైదానాన్ని వీడాడు. పాండ్యా ఫిట్‌గా లేకుంటే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 22న ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
క్రిక్‌బజ్ వార్తల ప్రకారం.. హార్దిక్ పాండ్యా స్కాన్ నివేదిక ముంబైకి పంపనున్నారు. ఇక్కడ ప్రత్యేక వైద్యులు తనిఖీ చేస్తారు. దీని తర్వాత మాత్రమే పాండ్యా జట్టులోకి తిరిగి రావడానికి సంబంధించి అప్‌డేట్ అందనుంది. పాండ్యా ఎడమ చీలమండకు తీవ్ర గాయమైంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ఓవర్‌లో పాండ్యా కేవలం మూడు బంతులు మాత్రమే వేయగలిగాడు. ఆ తర్వాత పాండ్యా ఓవర్ ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. కోహ్లీ మిగిలిన మూడు బంతులు వేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
గాయం తర్వాత పాండ్యా మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్‌కు తరలించారు. ప్రస్తుతం స్కానింగ్ ఫలితం రాలేదు. స్కానింగ్ రిపోర్టు వచ్చిన తర్వాత ముంబై పంపించి ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు బీసీసీఐ అధికారులు. భారత్ తదుపరి మ్యాచ్ ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. పాండ్యా ఒక్కరోజులో ఫిట్ నెస్ సాధించడం చాలా కష్టం. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుంటే ఈ మ్యాచ్‌కు దూరం అవుతాడు. పాండ్యా అవుటైతే ప్లేయింగ్ ఎలెవన్‌లో మరో ఆటగాడికి చోటు దక్కనుంది.
2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచింది. టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం నమోదు చేసింది.