Site icon HashtagU Telugu

IPL 2024: బిగ్ షాక్.. ఐపీఎల్ కి ముందు గాయపడ్డ హార్దిక్

IPL 2024

IPL 2024

IPL 2024: మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా ఈ సారి ముంబైపై అందరి చూపు పడింది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకి పెరుగుతుంది. అలాగే హార్దిక్ నాయకత్వంలో రోహిత్ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడు. ఇది రోహిత్ అభిమానులకు అస్సలు మింగుడుపడటం లేదు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ముంబైని సపోర్ట్ చేయబోమని తెగేసి చెప్తున్నారు. దీంతో హార్దిక్ పై మరింత ఒత్తిడి పెరిగింది.

రోహిత్ సారధ్యంలో ముంబై ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఆరోసారి కప్ కొట్టాలన్న ముంబై ఆశలు తీరుతాయా లేదా అన్నది పక్కనపెడితే తాజాగా హార్దిక్ పాండ్య మరోసారి గాయం బారీన పడ్డట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్‌లో హార్దిక్ పాండ్య ఇబ్బండి పడిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఎడమకాలికి గాయమైనట్లు వీడియో చూస్తే అర్ధమవుతుంది.బెంచ్‌పై పడుకున్న హార్దిక్‌కు ఫిజియో చికిత్స అందిస్తుండగా బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ అక్కడే ఉన్నాడు. అయితే హార్దిక్ గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ముంబై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ ఫ్యాన్స్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతుందట.

దేశంలో దశలవారీగా ఎన్నికల జరగనుండటంతో సెకండాఫ్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మొదట్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెకండాఫ్ మ్యాచ్‌లను కూడా భారత్‌లోనే నిర్ణయించాలని బీసీసీఐ భావించింది. ఎన్నికలు జరగని నగరాల్లో మ్యాచ్‌లు పెట్టాలనుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికలు పలు దశల్లో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించడంతో.. బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మొదట ప్రకటించిన మ్యాచ్ లు ఇండియాలో జరిపించి, మిగతా మ్యాచ్ లను విదేశాలకు షిఫ్ట్ చేయాలనీ బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలని ఆశపడ్డ అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి.

Also Read: General Election 2024 : దేశంలో మొత్తం రూ.96.88 కోట్లు ఓటర్లు – CEC రాజీవ్ కుమార్

Exit mobile version