టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) క్రికెట్‌లోనే కాకుండా తన లైఫ్ స్టయిల్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచు(India vs Pakistan)లో హార్దిక్ ధరించిన ఖరీదైన చేతి గడియారం అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది. మ్యాచులో అతని ప్రతిభ కంటే, అతను ధరించిన వాచ్ మరింతగా చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ వాచ్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ దీని గురించి ఆసక్తికరమైన చర్చలు సాగిస్తున్నారు.
Record in Cricket History : భారత్ vs పాక్ మ్యాచ్‌కు 60 కోట్ల వ్యూస్
రూ. 1.50 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్
హార్దిక్ చేతికి ఉన్న ఈ విలాసవంతమైన గడియారం ప్రఖ్యాత రిచర్డ్ మిల్లె కంపెనీ(Richard Mille masterpiece)కి చెందినదిగా గుర్తించారు. దీని రిటైల్ ధర సుమారు రూ. 1.50 కోట్లకు పైగా ఉంటుందనిLuxury మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. రిచర్డ్ మిల్లె బ్రాండ్ వాచీలు ఖరీదైన వాటిగా పేరొందాయి. ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే, అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్స్‌తో తయారు చేయబడటం, అలాగే లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడం.
సెలబ్రిటీల ప్రత్యేక వాచ్ కలెక్షన్‌లో హార్దిక్
హార్దిక్ పాండ్య మాత్రమే కాదు, ఈ రిచర్డ్ మిల్లె వాచ్‌ను ప్రఖ్యాత క్రీడాకారులు మరియు సినీ ప్రముఖులు కూడా కలిగి ఉన్నారు. టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి, ఫుట్‌బాల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో, అలాగే టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ బ్రాండ్ వాచ్ కలిగి ఉన్నారని సమాచారం. హార్దిక్ స్టైల్, లగ్జరీ లైఫ్‌పై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరిచే నేపథ్యంలో, ఈ వాచ్ ఇప్పుడు క్రికెట్ ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.