Hardik Pandya: మొహాలీలో హార్దిక్ విధ్వంసం..భారత్ స్కోర్ 208/6

ఆస్ట్రేలియాతో తొలి టీ ట్వంటీలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. రోహిత్ , కోహ్లీ నిరాశ పరిచినా...కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 09:45 PM IST

ఆస్ట్రేలియాతో తొలి టీ ట్వంటీలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. రోహిత్ , కోహ్లీ నిరాశ పరిచినా…కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
కేఎల్‌ రాహుల్‌ 32 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లతో తన హాఫ్‌ సెంచరీని రాహుల్‌ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ 55 రన్స్ కు ఔటవగా.. సూర్య కుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. జంపా బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. రాహుల్ , సూర్య కుమార్ యాదవ్ మూడో వికెట్ కి 68 రన్స్ జోడించారు. మరోవైపు పాండ్య కూడా
మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగి పోయాడు.
కేవలం 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.అఖరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన హార్దిక్ జట్టుకు 208 పరుగుల భారీ స్కోర్ అందించాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. హ్యజిల్ వుడ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది.