IPL 2020: హార్దిక్ స్లో ఓవర్ కారణంగా రూ.12 లక్షల జరిమానా

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి వరకు ఫలితం తేలడం లేదు. దీంతో మ్యాచ్ విన్నింగ్ పై ప్రేక్షకులు క్యూరియాసిటీ

IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి వరకు ఫలితం తేలడం లేదు. దీంతో మ్యాచ్ విన్నింగ్ పై ప్రేక్షకులు క్యూరియాసిటీగా వీక్షిస్తున్నారు. ప్లేయర్స్ సైతం కొంత ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఇన్నింగ్స్ ముగించాల్సిన సమయం దాటిపోతుంది. తద్వారా ఆటగాళ్లపై జరిమానా భారం పడుతుంది.

గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు.స్లో ఓవ‌ర్ రేటుకు సంబంధించి ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ప్ర‌కారం ఈ సీజ‌న్‌లో తొలి సారి గుజ‌రాత్ జ‌ట్టు స్లో ఓవ‌ర్ న‌మోదు చేయ‌డం విశేషం. నిజానికి ఐపీఎల్ మ్యాచ్‌లను మూడు గంటల 20 నిమిషాల్లో ముగించాల్సి ఉంటుంది. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా నాలుగు గంటల పాటు మ్యాచ్‌లు సాగడం సమస్యగా మారుతోంది.

గత రాత్రి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులతో సరిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లలో మాథ్యూ షార్ట్ (36), జితేష్ శ‌ర్మ (25) రాణించారు. కాగా.. పంజాబ్ కింగ్స్ విధించిన లక్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ 19.5 ఓవర్లల్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (67;49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా.. వృద్ధిమాన్ సాహా(30; 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు.ఈ సీజన్‌లో గుజరాత్ మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మంచి రేటింగ్ తో సత్తా చాటుతుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానం కైవసం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

Read More: IPL 2023: ఈ సీజన్ లో అత్యంత భారీ సిక్సర్ ఇదే..