Hardik Pandya: మంబై గెలిచింది.. కానీ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు షాక్‌..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 33వ మ్యాచ్‌లో గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 33వ మ్యాచ్‌లో గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అశుతోష్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైని వ‌ణికించాడు. చివరి వరకు పంజాబ్ విజయంపై ఆశలను సజీవంగా ఉంచాడు. కానీ అతను ఔట్ అయిన వెంటనే పంజాబ్ తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత ముంబై ఇండియన్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) భారాన్ని మోయవలసి వచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు భారీ జరిమానా పడింది.

ముల్లన్‌పూర్‌లోని పిసిఎ న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 18న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ మెయింటెయిన్ చేసినట్లు అభియోగాలు మోపనున్నట్లు బిసిసిఐ పోస్ట్ మ్యాచ్‌లో తెలిపింది. దీంతో జరిమానా విధించబడింది.

Also Read: KA Paul : KA పాల్ వద్ద 2 లక్షలు కూడా లేవట..అఫిడవిట్లో వెల్లడి

స్లో ఓవర్ రేట్ విషయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో చేసిన తొలి నేరం ఇది. మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం ఇదేనని, అందువల్ల పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు బోర్టు ప్రకటనలో తెలిపింది.

మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. ముంబై జ‌ట్టు పంజాబ్‌కు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే పంజాబ్ చాలా పేలవంగా ప్రారంభించింది. పవర్‌ప్లేలోనే 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత 10వ ఓవర్‌కు పంజాబ్ స్కోరు 77/6. అశుతోష్ ఒక ఎండ్‌ను పట్టుకుని 28 బంతుల్లో ఏడు సిక్స్‌లు, రెండు ఫోర్ల సహాయంతో 61 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, పంజాబ్‌ను విజయానికి చేరువ చేయ‌లేక‌పోమాడు. అయితే అతను ఔట్ అయిన వెంటనే పంజాబ్ మ్యాచ్‌లో ఓడిపోయింది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 19 Apr 2024, 11:23 AM IST