Hardik Pandya: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా డౌటే..!

భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఏ ఆటగాళ్లు ఆడతారు? దీనికి సంబంధించి నేడు (ఏప్రిల్ 30) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమావేశం జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఏ ఆటగాళ్లు ఆడతారు? దీనికి సంబంధించి నేడు (ఏప్రిల్ 30) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమావేశం జరగనుంది. 2024లో అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు జట్టును బీసీసీఐ సెలెక్ట‌ర్లు జ‌ట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ప్రపంచ కప్ కోసం జరిగే సమావేశంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ స్లాట్‌పై అతిపెద్ద చర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. దీని కోసం రిషబ్ పంత్, KL రాహుల్, సంజు శాంసన్ పోటీప‌డుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) జట్టులో చోటు సంపాదించగలడా లేదా అనేది మరో పెద్ద ప్రశ్న. రిషబ్ పంత్ ప్రపంచకప్‌లో ప్రముఖ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యే అవ‌కాశం ఉంది.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం (ఏప్రిల్ 30) అహ్మదాబాద్‌లో బీసీసీఐ సెక్రటరీ జై షాతో సమావేశమవుతుందని ఓ వార్త ప‌త్రిక నివేదించింది. ఈ సమావేశంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఖరారు చేయనున్నట్లు పేర్కొంది. అయితే జట్టు ప్రకటన ఒకరోజు ఆలస్యం కావచ్చు. జై షా జట్టు ఎంపిక కన్వీనర్ కూడా. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఇప్పుడు బీసీసీఐ సమావేశం అహ్మదాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

Also Read: Pooja Hegde : ఆఫర్లు లేకపోయినా తగ్గేదేలేదు అంటున్న పూజా హెగ్దే..!

టీ20 ప్రపంచకప్‌ కోసం జరగనున్న సమావేశంలో జట్టులోని వికెట్‌ కీపర్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై ప్రధానంగా చర్చ జరగనుంది. IPL టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 144 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేసిన KL రాహుల్, 161 స్ట్రైక్ రేట్‌తో 385 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఇద్దరూ రెండవ వికెట్ కీపర్ స్థానంలో పోటీ ప‌డుతున్నారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు. దీని కారణంగా ఈసారి ఐపీఎల్‌లో రాజస్థాన్ ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అతను ఈ IPLలో 3వ స్థానంలో ఆడుతున్నాడు. ఒక‌వేళ శాంస‌న్ టీమిండియాకు ఎంపికైతే నాలుగో స్థానంలో బ్యాటింగ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నాడు.

పాండ్యా డౌటే

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మే 1న టీమిండియా జ‌ట్టును ఎంపిక చేయనున్నారు. అయితే బీసీసీఐ సెలెక్ట‌ర్లు టీ20 ప్రపంచ క‌ప్ జట్టులో పాండ్యాను ప‌క్క‌న పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్‌లో పాండ్యా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫ‌ల‌మ‌వుతుండ‌టంతో బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిగిలిన ఆట‌గాళ్లు పాండ్యా కంటే అత్యుత్త‌మంగా రాణిస్తుండ‌టం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. మ‌రీ పాండ్యా టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు ఎంపిక అవుతాడో లేదో తెలియాలి అంటే మ‌రో 24 గంట‌లు ఆగాల్సిందే.

We’re now on WhatsApp : Click to Join

 

 

  Last Updated: 30 Apr 2024, 10:14 AM IST