Site icon HashtagU Telugu

Hardik Pandya : టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా

Hardhik

Hardhik

టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20WC) గెలుపుతో భారత క్రికెటర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మెగా టోర్నీతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వీరి స్థానాలెను భర్తీ చేసేందుకు టీమిండియా మేనేజ్ మెంట్ సిద్ధమైంది. ప్రస్తుతం రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ (T20I captain) గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా ( Jay Shah) హింట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా (Hardik Pandya)ను సారథిగా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు ఆచితూచి స్పందించారు. కెప్టెన్ ఎవరనేది సెలక్టర్లు నిర్ణయిస్తారని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

సెలక్టర్లు నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు. హార్థిక్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారని, అయితే తన ఆటతోనే అతనేంటో నిరూపించుకున్నాడని ప్రశంసించారు. కాగా రోహిత్ స్థానంలో టీ ట్వంటీ ఫార్మాట్ కు పాండ్యానే సెలక్టర్లు బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్యా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిపాడు.

ఈ ఏడాది ట్రేడింగ్ ద్వారా ముంబై పాండ్యాను భారీ ధరకు దక్కించుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే అనుకున్న రీతిలో హార్థిక్ జట్టును సక్సెస్ ఫుల్ గా లీడ్ చేయలేకపోయాడు. అయినప్పటకీ బీసీసీఐ సెలక్టర్లు ఫ్యూచర్ కెప్టెన్ గా అతని వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. సూర్యకుమార్ , గిల్, పంత్ వంటి ప్లేయర్స్ ఉన్న హార్థిక్ కే అప్పగించే అవకాశముంది. ఇక వచ్చే వారం జరగనున్న జింబాబ్వే టూర్ కు మాత్రం శుభ్ మన్ గిల్ ను సారథిగా ఎంపిక చేశారు.

Read Also :