India vs New Zealand: జోరు కొనసాగేనా..?

భారత్‌, న్యూజిలాండ్ (India vs New Zealand) ఇక టీ ట్వంటీ సమరానికి సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా శుభారంభం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది కివీస్.. పొట్టి ఫార్మాట్ కావడంతో అభిమానులకు ధనాధన్‌ వినోదం గ్యారెంటీగా కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 03:00 PM IST

భారత్‌, న్యూజిలాండ్ (India vs New Zealand) ఇక టీ ట్వంటీ సమరానికి సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా శుభారంభం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది కివీస్.. పొట్టి ఫార్మాట్ కావడంతో అభిమానులకు ధనాధన్‌ వినోదం గ్యారెంటీగా కనిపిస్తోంది.

భారత్ , న్యూజిలాండ్ మధ్య మరో ఆసక్తికర సమరానికి వేళైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇవాళ రాంఛీ వేదికగా జరగనుంది. రోహిత్‌, కోహ్లి వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఫుల్ జోష్‌లో ఉంది. పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు ఓపెనర్ గిల్ సూపర్ ఫామ్‌ అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. వీరితో పాటు రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడాలతో భారత బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది.

Also Read: Sania Mirza: గ్రాండ్‌స్లామ్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న సానియామీర్జా

బ్యాటింగ్‌లో భారత్‌ మెరుగ్గానే కనిపిస్తున్నా బౌలింగ్‌లోనూ పుంజుకోవాల్సి అవసరముంది. శ్రీలంకతో సిరీస్‌లో పేస్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ నిరాశపరిచాడు. అతను మళ్ళీ గాడిన పడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. శ్రీలంకతో సిరీస్‌లో ఆకట్టుకున్న శివమ్ మావి ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌తో కలిసి పేస్‌ భారాన్ని మోయనున్నాడు. అటు స్పిన్ విభాగంలో సుందర్‌తో కలిసి చాహల్‌, కుల్‌దీప్‌లలో ఒకరికే అవకాశం దక్కనుంది.

మరోవైపు వన్డే సిరీస్‌ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ పట్టుదలగా ఉంది. విలియమ్సన్‌, సౌథీ లేకపోవడం ఈ సిరీస్‌లోనూ ఆ జట్టుకు లోటే. జట్టుకు శాంట్నర్‌ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్‌ అలెన్‌, కాన్వే, ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్‌ వంటి వారితో కివీస్‌ బ్యాటింగ్‌ కూడా బలంగానే ఉంది. ఇండోర్‌ వన్డేలో కేవలం 100 బంతుల్లో 138 పరుగులు చేసిన కాన్వేపై అంచనాలున్నాయి. ఫెర్గూసన్‌ మినహా పేస్‌ బౌలింగ్‌లో సీనియర్లు లేకపోవడం న్యూజిలాండ్‌కు సమస్యే. ఇక స్పిన్నర్‌ ఇష్‌ సోథికి భారత్‌లో మంచి రికార్డు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న రాంఛీలో రాంచీలో ఛేజింగ్‌ టీమ్‌కే రికార్డు అనుకూలంగా ఉంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండనుండడంతో మరోసారి హైస్కోరింగ్ మ్యాచ్‌ను అంచనా వేస్తున్నారు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌, హార్దిక్‌, దీపక్‌ హుడా, సుందర్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌, కుల్‌దీప్‌

న్యూజిలాండ్‌: అలెన్‌, కాన్వే, చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌, బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌, టిక్నర్‌, ఇష్‌ సోధి, బెన్‌ లిస్టర్‌, ఫెర్గూసన్‌