Hardik Pandya: కివీస్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా!

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్ పాండ్యాకు మరోసారి బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో టీ ట్వంటీ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు కివీస్‌తో టీట్వంటీ , వన్డే సిరీస్‌లు ఆడనుంది.

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:13 PM IST

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్ పాండ్యాకు మరోసారి బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో టీ ట్వంటీ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు కివీస్‌తో టీట్వంటీ , వన్డే సిరీస్‌లు ఆడనుంది. షార్ట్ ఫార్మాట్‌కు పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో కోహ్లీ, రోహిత్‌శర్మతో సహా పలువురు సీనియర్లు విశ్రాంతినిచ్చారు.
బిజీ షెడ్యూల్ కారణంగా రొటేషన్ పాలసీ అనుసరిస్తున్న బీసీసీ సెలక్టర్లు కివీస్‌తో సిరీస్‌ కోసం యువ క్రికెటర్లతో కూడిన జట్టునే ఎంపిక చేశారు. 16 మందితో కూడిన జట్టుకు వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ ఎంపికయ్యాడు. పాండ్యా టీ ట్వంటీ టీమ్‌ను లీడ్ చేయనుండగా… వన్డే టీమ్‌కు సారథిగా శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశారు. అయితే రెండు ఫార్మాట్లలోనూ కామన్‌ గా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను పంత్‌కే అప్పగించారు.
టీ ట్వంటీ జట్టులో ఇషాన్ కిషన్, శుభమన్‌ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌ , వాషింగ్టన్ సుందర్‌తో పాటు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కింది. టీ ట్వంటీ సిరీస్‌ కోసం హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ , అర్షదీప్ పేస్ భారాన్ని మోయనున్నారు. మరోవైపు వన్జే జట్టులో కుల్దీప్‌ సేన్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్, శార్థూల్ ఠాకూర్‌ చోటు దక్కించుకున్నారు.

కివీస్‌తో టీ ట్వంటీలకు భారత జట్టు ః
పాండ్యా ( కెప్టెన్), పంత్ ( వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ , అర్షదీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్

కివీస్‌తో వన్డేలకు భారత జట్టు ః
శిఖర్ ధావన్ (కెప్టెన్),పంత్,గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, షాబాద్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్‌సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్