సూర్య, హర్థిక్ లకు ప్రమోషన్… కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఆ ఇద్దరూ ఔట్

టీమిండియా ప్లేయర్లు హార్థిక్ పటేల్ మరియు సూర్య కుమార్ యాదవ్ లకు ప్రమోషన్ లభించింది

  • Written By:
  • Updated On - December 13, 2022 / 09:41 PM IST

వచ్చే సీజన్ కు సంబందించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ సారి కాంట్రాక్ట్ జాబితాలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. షార్ట్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య లకు ప్రమోషన్ దక్కనుంది. వీరిద్దరితో పాటు శుభ్ మన్ గిల్ కు కూడా ప్రమోషన్ లభించనుంది. భవిష్యత్తు టీ20 కెప్టెన్‌గా అభివర్ణిస్తున్న హార్దిక్‌ పాండ్యా కూడా ఈ లేటెస్ట్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌లో గ్రూప్‌ సి నుంచి గ్రూప్‌ బికి వెళ్లే అవకాశం ఉంది. ప్లేయర్స్‌ ప్రమోషన్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన తాజా లిస్ట్‌లో సూర్యకుమార్‌, శుభ్‌మన్‌ గిల్‌లాంటి వాళ్లు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే చాలా రోజులుగా టీమ్‌కు దూరంగా ఉన్న సీనియర్‌ ప్లేయర్స్‌ అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మలను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. వీళ్లతోపాటు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా కాంట్రాక్ట్ కోల్పోనున్నాడు.

కాంట్రాక్ట్ లిస్ట్ లో నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేసిన బీసీసీఐ ఏ+ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్‌ ఒక్కొక్కరికి రూ.7 కోట్లు, ఎ లో ఉన్న వారికి ఏటా రూ.5 కోట్లు, బిలో ఉన్న వారికి ఏటా రూ.3 కోట్లు, సిలో ఉన్న వారికి ఏటా రూ.కోటి అందజేస్తుంది.కాగా డిసెంబర్‌ 21న బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగనుంది. ఇందులో సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌తోపాటు మరో 11 అంశాలను చర్చించనున్నారు. అయితే ఈ మీటింగ్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ వైఫల్యంపై చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.