Hardik Banned: ఐపీఎల్ 2024లో 67వ మ్యాచ్‌లో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్‌ఎస్‌జీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం MI 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీజన్ మొత్తం పేలవ ప్రదర్శన కనబర్చిన ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మొత్తం జట్టుకు కఠినమైన శిక్ష (Hardik Banned) విధించబడింది.
Also Read: Chandu : సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. న్యాయం చేయాలంటూ భార్య అభ్యర్ధన..
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL 2024లో తన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా షాక్ తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఒక్క మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అంతేకాకుండా రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. “స్లో ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో ఇది ముంబై చేసిన మూడవ నేరం. అందువల్ల పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించబడింది. జట్టు తదుపరి మ్యాచ్‌లో ఆడకుండా నిషేధించబడింది” అని ఐపిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మాత్రమే కాదు ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన MI ప్లేయింగ్ XIకి వ్యక్తిగతంగా రూ. 12 లక్షలు లేదా వారి సంబంధిత మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధించబడింది.
We’re now on WhatsApp : Click to Join
రిషబ్ పంత్ తర్వాత ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ నిషేధం పొందిన రెండో కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిషేధం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆలస్యం వెనుక వివిధ కారణాలను పేర్కొంటూ DC నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేసింది. అయితే నిషేధం అప్పటికీ సమర్థించబడింది. అటువంటి పరిస్థితిలో RCBతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ DCని నడిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా జట్టుకు ఈ ఏడాది మ్యాచ్‌లన్నీ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాండ్యా వచ్చే ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.