Site icon HashtagU Telugu

Harbhajan IPL XI: భజ్జీ ఐపీఎల్ ఆల్ టైం బెస్ట్ ఎలెవన్ ఇదే

Harbhajan Singh And Ms Dhoni Imresizer

Harbhajan Singh And Ms Dhoni Imresizer

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ ఐపీఎల్ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. తన జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనిని కెప్టెన్ గా ఎంపిక చేశాడు. అయితే, హర్భజన్ సింగ్ ఈ జట్టులో ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌లకు స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అతనితో పాటు చాలా మంది స్టార్ క్రికెటర్లను విస్మరించిన టర్బోనేటర్.. తన జట్టులో తనకే చోటు కల్పించుకోకపోవడం ఆశ్చర్య పరిచింది.

ఓపెనర్ల కోటాలో పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు, వెస్టిండీస్ పరుగుల వీరుడు క్రిస్ గేల్ అలాగే మరో ఓపెనర్‌గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మను ఏంపిక చేశాడు. అలాగే మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చిన హర్భజన్ సింగ్.. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ షేన్ వాట్సాన్ ను ఎంపిక చేశాడు .. అలాగే తన జట్టులో ఐదో ప్లేస్‌ కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను ఎంచుకున్నాడు.

తన జట్టులో ఆరో స్థానం కోసం వికెట్ కీపర్ గా ధోనిని ఎంపిక చేసిన హర్భజన్ సింగ్ .. ఆల్‌రౌండర్ల విభాగంలో ముంబై ఇండియన్స్ సీనియర్ ఆల్ రౌండర్ కీరన్‌ పోలార్డ్‌, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న సునీల్ నరైన్ ను ఎంపిక చేయగా.. స్పెషలిస్ట్‌ పేసర్ల విభాగంలో శ్రీలంక మాజీ పేసర్ ముంబై ఇండియన్స్ మాజీ యార్కర్ కింగ్ లసిత్‌ మలింగ, అలాగే ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాలను ఎంచుకున్నాడు..
ఇక హర్భజన్ సింగ్ ప్రకటించిన ఐపీఎల్‌ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్ గా ఉండగా.. ఆ జట్టులో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, షేన్ వాట్సన్, ఏబీ డివిల్లియర్స్, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కీరన్ పోలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు చోటు దక్కించుకున్నారు.