Happy Birthday Rohit: రోహిత్ బ‌ర్త్‌డేను సెలబ్రేట్ చేసిన MI.. ట్రెండ్ అవుతున్న “సలామ్ రోహిత్ భాయ్” వీడియో..!

భారత జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆట‌గాడు రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు. నేటితో రోహిత్‌కి 37 ఏళ్లు. భారత దిగ్గజ క్రికెటర్ భారత క్రికెట్‌కు చాలా అందించాడు.

  • Written By:
  • Updated On - April 30, 2024 / 01:14 PM IST

Happy Birthday Rohit: భారత జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆట‌గాడు రోహిత్ శర్మ (Happy Birthday Rohit) పుట్టినరోజు నేడు. నేటితో రోహిత్‌కి 37 ఏళ్లు. భారత దిగ్గజ క్రికెటర్ భారత క్రికెట్‌కు చాలా అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయినా.. ప్రపంచం మొత్తం అతని కెప్టెన్సీని కొనియాడుతోంది. మూడు ఫార్మాట్లలోనూ హిట్ అయిన ఆట‌గాడ రోహిత్ శర్మ. T20, ODI క్రికెట్ లేదా టెస్ట్ క్రికెట్ అయినా మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ సహకారం విలువైనది. ఐపీఎల్ మధ్యలో రోహిత్ శర్మ పుట్టినరోజు రావడం అభిమానులకు ఇంతకంటే పెద్ద ఆనందం ఏముంటుంది. రోహిత్ పుట్టినరోజును ముంబై ఇండియన్స్ ఘ‌నంగా సెలబ్రేట్ చేసింది.

‘సలామ్ రోహిత్ భాయ్’

ముంబై ఇండియన్స్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో రోహిత్ శర్మ గురించి వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చుతోంది. ఆ వీడియోలో రోహిత్‌ని రాజులా చూపించారు. ఈ వీడియోలోని ప్లేబ్యాక్ సాంగ్‌లో సలామ్ రాకీ భాయ్ సాంగ్ ను ఉప‌యోగించి స‌లామ్ రోహిత్ భాయ్ అనే పాట‌ను యాడ్ చేశారు. ఈ సాంగ్ వీడియో ట్విట్ట‌ర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ విడుదల చేసిన వీడియోలో ఉపయోగించబడిన పాట రోహిత్ శర్మకు క‌రెక్టుగా సెట్ అయ్యింద‌ని ప‌లువురు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

Also Read: UGC NET 2024: అలర్ట్.. ఈ పరీక్ష తేదీల్లో మార్పులు, కార‌ణం ఏంటంటే..?

రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్

ఇక‌పోతే రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 59 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 17 అర్ధ సెంచరీలు, 12 సెంచరీలతో మొత్తం 4138 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ సగటు 45.47గా ఉంది. అంతే కాకుండా హిట్ మ్యాన్ 262 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డే క్రికెట్‌లో హిట్‌మాన్ 49.12 సగటుతో 10709 పరుగులు చేశాడు. రోహిత్ వన్డేల్లో 55 హాఫ్ సెంచరీలు, 31 సెంచరీలు కూడా చేశాడు. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో కూడా రోహిత్ శర్మ రికార్డు అద్భుతంగా ఉంది. రోహిత్ మొత్తం 151 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 31.29 సగటుతో 3974 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. ఇక రాబోయే టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో గెలుపే ల‌క్ష్యంగా రోహిత్ అండ్ కో క‌స‌రత్తులు చేయ‌నున్నారు.

We’re now on WhatsApp : Click to Join