IND vs ENG 5th Test : జానీ బెయిర్ స్టో సెంచరీ…భారత్ ను ఆధిక్యంలో నిలిపిన పూజారా..!!!

ఇంగ్లండ్ ఎడ్జ్ బాస్టన్ టెస్టులో మూడోరోజు కూడా భారత జట్టు ఆధిపత్యం కొనసాగించింది. మూడోరోజు ఆటముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత జట్టు.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 06:00 AM IST

ఇంగ్లండ్ ఎడ్జ్ బాస్టన్ టెస్టులో మూడోరోజు కూడా భారత జట్టు ఆధిపత్యం కొనసాగించింది. మూడోరోజు ఆటముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత జట్టు. ఇంగ్లాండ్ పై 257పరుగుల ఆధిక్యంగా ఉంది. మరో 7 వికెట్లు ఉండటం, మరోరెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ ఆఖరి ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యాలను సులభంగా ఛేదించింది. దీంతో 4రోజులు తొలి రెండు సెషన్లలలో భారత బ్యాటర్లు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది.

తొలిఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి అవుట్ అయిన శుభ్ మన్ గిల్, రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగులకు ఔటయ్యాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో రెండో బంతికి ఫోర్ కొట్టిన గిల్…3బంతికి జాక్ క్రావ్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 44 బంతుల్లో ఒక ఫోర్తో 11 పరుగులు చేసిన హనుమవిహారిని స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ బౌలింగ్ లో రూట్ కి క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ గ్లవ్స్ తాకుతూ వెళ్లిన బంతి నేరుగా జో రూట్ చేతుల్లో పడింది. 75పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది టీమిండియా.

పుజారా, రిషబ్ పంత్ కలిసి 4వ వికెట్ కు అజేయంగా 50 పరుగులు చేశారు. 139 బంతుల్లో 5 ఫోర్లు 50 పరుగులు పూర్తి చేశారు. ఛతేశ్వర్ పూజారాతోపాటు 46 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు రిషబ్ పంత్. అంతకుముందు ఇంగ్లాండ్ తొలిఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలిఇన్నింగ్స్ లో 416 పరుగుల టీమిండియా జట్టుకు 132 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్ నైట్ స్కోర్ 84/5వద్ద మూడో రోజు ఆటను కొనసాగించింది ఇంగ్లాండ్. జానీ బెయిర్ స్టో సెంచరీ కారణంగా ఫాలో ఆన్ తప్పించుకుంది.

షమీ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను శార్థూల్ ఠాకూర్ మిస్ చేశాడు. 18 పరుగులు వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడ్ బెన్ స్టోక్స్ . బుమ్రా క్యాచ్ డ్రాప్ చేయడంతో అవుట్ మిస్ చేసుకున్న బెన్ స్టోక్స్ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 25 పరుగులు చేశాడు బెన్ స్టోక్స్ . బెన్ స్టోక్స్ ఔట్ తర్వాత దూకుడు పెంచాడు జానీ బెయిర్ స్టో. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. 119బంతుల్లో సెంచరీ చేశాడు.

మొదటి 64 బంతుల్లో 16 పరుగులు చేసిన జానీ…ఆతర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఈ ఏడాది జానీ బెయిర్ స్టోకి ఇది 5వ సెంచరీ. 5 అంతకంటే కింద బ్యాటింగ్ కు వస్తూ ఒక ఏడాదిలో ఐదు టెస్టు సెంచరీలు చేసిన రెండ్ బ్యాటర్ గా జానీ బెయిర్ స్టో నిలిచాడు. ఇక రెండు దేశాలపై 50 పైగా క్యాచులు అందుకున్న మొదటి భారత ఫీల్డర్ గా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 5 బంతుల్లో 1 పరుగు చేసిన స్టువర్ట్ బ్రాండ్ ను అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్..57 బంతుల్లో 4 పోర్లతో 36 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ లో ఒక ఫోర్, సిక్సర్ బాదిన మ్యాట్ ప్యాట్స్ 18 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్ తో 19 పరుగులు చేసి అవుట్ కావడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది.